News March 30, 2025
హాలీవుడ్ దిగ్గజ నటుడు డెనిస్ కన్నుమూత

ప్రముఖ హాలీవుడ్ నటుడు డెనిస్ ఆర్న్‌ట్(86) మృతిచెందారు. వృద్ధాప్య కారణాలతో ఆయన కన్నుమూశారని ఆయన కుటుంబీకులు ప్రకటనలో తెలిపారు. 1939, ఫిబ్రవరి 23న జన్మించిన డెనిస్ 50 ఏళ్ల పాటు నటుడిగా కొనసాగారు. బేసిక్ ఇన్‌స్టింక్ట్, అనకొండ సీక్వెల్, స్నైపర్ 3 వంటి పలు హిట్ సినిమాల్లో, అనేక సిరీస్‌లలో ఆయన నటించారు.
Similar News
News April 2, 2025
వక్ఫ్ బిల్లుతో ముస్లింలకు మేలు: అమిత్ షా

వక్ఫ్ బిల్లుతో ముస్లింలకు మేలు జరుగుతుందని అమిత్‌షా స్పష్టం చేశారు. దీని ద్వారా వక్ఫ్ ఆదేశాలను కోర్టుల్లో సవాల్ చేయవచ్చన్నారు. ఈ బిల్లును చర్చి బోర్డులు కూడా సమర్థిస్తున్నాయని, ఇది అవినీతికి తప్ప ఏ మతానికి వ్యతిరేకం కాదని తేల్చి చెప్పారు. దీని ద్వారా మతాల మధ్య ఘర్షణ సృష్టించాలనే ఆలోచన తమకు లేదని ఆయన వివరించారు. ఈ బిల్లును తాము రాజ్యాంగబద్ధంగానే రూపొందించామని వెల్లడించారు.
News April 2, 2025
ఇంటర్ అర్హతతో నేవీలో ఉద్యోగాలు

ఇండియన్ నేవీ ‘అగ్నివీర్ సీనియర్ సెకండరీ రిక్రూట్’ పోస్టులకు ప్రకటన విడుదల చేసింది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునేవారు ఇంటర్‌లో మ్యాథ్స్, ఫిజిక్స్ సబ్జెక్టులు పాసై 2004 సెప్టెంబర్ 1-2008 డిసెంబర్ 31 మధ్య జన్మించి ఉండాలి. ఎంపికైన ప్రతి నలుగురిలో ఒకరికే పర్మినెంట్ జాబ్. జీతం తొలి నాలుగేళ్లు రూ.30 వేల నుంచి రూ.40 వేల మధ్యలో ఉంటుంది. ఈ నెల 10లోగా https://www.joinindiannavy.gov.in/లో అప్లై చేసుకోవాలి.
News April 2, 2025
ప్రపంచానికే సాయం.. భారత్ విపత్తు దౌత్యం

ప్రపంచంలో ఏ దేశంలోనైనా సరే విపత్తు సంభవించిందంటే మొట్ట మొదటిగా భారతే స్పందిస్తుంది. 1959లో టిబెట్ శరణార్థులకు ఆశ్రయం కల్పించడం నుంచి నిన్న మొన్నటి మయన్మార్ భూకంపంలో ‘ఆపరేషన్ బ్రహ్మ’ వరకు భారత్ చేసిన సాయం అంతాఇంతా కాదు. దీన్ని ‘విపత్తు దౌత్యం’గా విదేశీ వ్యవహారాల నిపుణులు వివరిస్తున్నారు. సాధారణ దౌత్యంతో కుదరని బలమైన సంబంధాల్ని ఈ దారిలో భారత్ సాధిస్తోందని కొనియాడుతున్నారు.