News March 30, 2025
గత ఐదేళ్లు రాష్ట్రంలో కళ తప్పింది: సీఎం చంద్రబాబు

AP: ‘ప్రజలే ముందు’ అనే నినాదంతో ముందుకు వెళ్తున్నట్లు సీఎం చంద్రబాబు తెలిపారు. సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలనను సమన్వయం చేస్తున్నామని పేర్కొన్నారు. గత ఐదేళ్లు రాష్ట్రంలో కళ తప్పిందని చెప్పారు. వైసీపీ ప్రభుత్వం అనేక సమస్యలు సృష్టించిందని విమర్శించారు. ఒక్కో చిక్కుముడిని వదిలించుకుంటున్నట్లు తెలిపారు. పేదరిక నిర్మూలనకు కృషి చేస్తున్నామని పేర్కొన్నారు.
Similar News
News September 11, 2025
దాడులకు కుట్ర.. టెర్రరిస్టుల అరెస్టు

ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు ఐదుగురు టెర్రరిస్టులను అరెస్టు చేశారు. ఢిల్లీ, మధ్యప్రదేశ్, ఝార్ఖండ్, తెలంగాణలో వీరిని అదుపులోకి తీసుకున్నారు. అందులో తెలంగాణలోని బోధన్‌కు చెందిన ఓ యువకుడూ ఉన్నాడు. ఇటీవల రాంచీలో కుట్రలు పన్నుతున్న డ్యానిష్‌ను అరెస్టు చేశారు. అతడు ఇచ్చిన సమాచారంతో ఐదుగురిని పట్టుకున్నారు. దేశవ్యాప్తంగా దాడులకు పాల్పడే అవకాశాలు ఉన్న నేపథ్యంలో అన్ని రాష్ట్రాలకు కేంద్రం అలర్ట్ చేసింది.
News September 11, 2025
రూ.78వేల జీతంతో RBIలో జాబ్స్

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 120 ఆఫీసర్ గ్రేడ్-బీ (జనరల్, డీఈపీఆర్, డీఎస్ఐఎం) పోస్టుల భర్తీకి <
News September 11, 2025
వార్డ్‌రోబ్ నుంచి వాసన వస్తోందా?

వర్షాకాలంలో దుస్తులు ఆరడం పెద్ద సమస్య. ఆరడానికి చాలాసమయం పట్టడంతో పాటు, అదోరకమైన వాసన వస్తుంది. ఇలాకాకుండా ఉండాలంటే దళసరి, పల్చటి బట్టలను వేర్వేరుగా ఉతికి, ఆరేయాలి. నానబెట్టే ముందు సర్ఫ్‌లో కాస్త బేకింగ్ సోడా, నిమ్మరసం కలపాలి. సువాసన కోసం కండీషనర్స్ బదులు రోజ్ వాటర్ కలిపిన నీటితో జాడించి ఆరేయాలి. వార్డ్‌రోబ్‌లో రోజ్మెరీ, నాఫ్తలీన్ బాల్స్, సిలికాజెల్ ప్యాకెట్స్ పెడితే దుర్వాసన రాకుండా ఉంటుంది.