News March 30, 2025

రేపు, ఎల్లుండి సెలవులు

image

తెలుగు రాష్ట్రాల్లో రేపు రంజాన్ పండుగ జరుపుకోనుండటంతో ప్రభుత్వ బడులు, కాలేజీలు, కార్యాలయాలకు సెలవు ఉండనుంది. APలో రేపు ఒక్క రోజే హాలిడే ఇవ్వగా, TG సర్కారు రేపటితో పాటు APR 1న కూడా సెలవు ప్రకటించింది. బోనాలు, క్రిస్మస్, రంజాన్ తర్వాతి రోజు సెలవుగా ప్రకటించడం గత ప్రభుత్వం నుంచి రాష్ట్రంలో ఆనవాయితీగా వస్తోంది. మరోవైపు, సౌదీలో నిన్న నెలవంక కనిపించగా అక్కడ ఇవాళ రంజాన్ జరుపుకుంటున్నారు.

Similar News

News April 2, 2025

వక్ఫ్ బిల్లుతో ముస్లింలకు మేలు: అమిత్ షా

image

వక్ఫ్ బిల్లుతో ముస్లింలకు మేలు జరుగుతుందని అమిత్‌షా స్పష్టం చేశారు. దీని ద్వారా వక్ఫ్ ఆదేశాలను కోర్టుల్లో సవాల్ చేయవచ్చన్నారు. ఈ బిల్లును చర్చి బోర్డులు కూడా సమర్థిస్తున్నాయని, ఇది అవినీతికి తప్ప ఏ మతానికి వ్యతిరేకం కాదని తేల్చి చెప్పారు. దీని ద్వారా మతాల మధ్య ఘర్షణ సృష్టించాలనే ఆలోచన తమకు లేదని ఆయన వివరించారు. ఈ బిల్లును తాము రాజ్యాంగబద్ధంగానే రూపొందించామని వెల్లడించారు.

News April 2, 2025

ఇంటర్ అర్హతతో నేవీలో ఉద్యోగాలు

image

ఇండియన్ నేవీ ‘అగ్నివీర్ సీనియర్ సెకండరీ రిక్రూట్’ పోస్టులకు ప్రకటన విడుదల చేసింది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునేవారు ఇంటర్‌లో మ్యాథ్స్, ఫిజిక్స్ సబ్జెక్టులు పాసై 2004 సెప్టెంబర్ 1-2008 డిసెంబర్ 31 మధ్య జన్మించి ఉండాలి. ఎంపికైన ప్రతి నలుగురిలో ఒకరికే పర్మినెంట్ జాబ్. జీతం తొలి నాలుగేళ్లు రూ.30 వేల నుంచి రూ.40 వేల మధ్యలో ఉంటుంది. ఈ నెల 10లోగా https://www.joinindiannavy.gov.in/లో అప్లై చేసుకోవాలి.

News April 2, 2025

ప్రపంచానికే సాయం.. భారత్ విపత్తు దౌత్యం

image

ప్రపంచంలో ఏ దేశంలోనైనా సరే విపత్తు సంభవించిందంటే మొట్ట మొదటిగా భారతే స్పందిస్తుంది. 1959లో టిబెట్ శరణార్థులకు ఆశ్రయం కల్పించడం నుంచి నిన్న మొన్నటి మయన్మార్‌ భూకంపంలో ‘ఆపరేషన్ బ్రహ్మ’ వరకు భారత్ చేసిన సాయం అంతాఇంతా కాదు. దీన్ని ‘విపత్తు దౌత్యం’గా విదేశీ వ్యవహారాల నిపుణులు వివరిస్తున్నారు. సాధారణ దౌత్యంతో కుదరని బలమైన సంబంధాల్ని ఈ దారిలో భారత్ సాధిస్తోందని కొనియాడుతున్నారు.

error: Content is protected !!