News March 30, 2025
హార్దిక్ పాండ్యకు మరో షాక్!

వరుస ఓటముల్లో ఉన్న MI కెప్టెన్ హార్దిక్ పాండ్యకు మరో షాక్ తగిలింది. నిన్న GTతో జరిగిన మ్యాచ్‌లో స్లో ఓవర్ రేట్ కారణంగా ఆయనకు IPL గవర్నింగ్ కౌన్సిల్ రూ.12లక్షల జరిమానా విధించింది. ఈ ఏడాది ఓ కెప్టెన్‌కు ఫైన్ పడటం ఇదే తొలిసారి. గత సీజన్ ఆఖరి మ్యాచ్‌లో స్లో ఓవర్ రేట్ ఉండటంతో ఈ ఏడాది తొలి మ్యాచ్‌లో హార్దిక్ నిషేధానికి గురయ్యారు. స్లో ఓవర్ రేట్ కారణంగా హార్దిక్ తరచూ జరిమానాల్ని ఎదుర్కొంటున్నారు.
Similar News
News April 2, 2025
జపాన్‌లో భారీ భూకంపం

జపాన్‌లోని క్యుషు కోస్టల్ ప్రాంతంలో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 6.2గా నమోదైంది. ఇటీవల మయన్మార్‌లో భారీ భూకంపం కారణంగా 2,700 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ఇటీవల థాయిలాండ్, అఫ్గానిస్థాన్, భారత్‌లోని పలు ప్రాంతాల్లోనూ భూప్రకంపనలు వచ్చిన సంగతి తెలిసిందే.
News April 2, 2025
కర్నూలు-విజయవాడ మధ్య విమాన సర్వీసులకై విజ్ఞప్తి

AP: కర్నూలు నుంచి విజయవాడకు విమాన సర్వీసులు నడపాలని కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడిని రాష్ట్ర మంత్రి టీజీ భరత్ కోరారు. ఢిల్లీలో కేంద్రమంత్రిని కలిసి ఈ మేరకు విజ్ఞప్తి చేయగా, ఆయన సానుకూలంగా స్పందించారు. ఓర్వకల్లు ఇండస్ట్రియల్ హబ్‌లో పరిశ్రమల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని వివరించారు. విమాన సర్వీసులూ అందుబాటులోకి వస్తే పారిశ్రామికవేత్తల రాకపోకలకు సౌకర్యంగా ఉంటుందన్నారు.
News April 2, 2025
వేసవి సెలవులు.. కీలక ఆదేశాలు

TG: వేసవి సెలవులు ఇచ్చినా పలు ఇంటర్ కాలేజీలు క్లాసులు నిర్వహిస్తున్నట్లు ఫిర్యాదులు రావడంపై ఇంటర్ బోర్డు స్పందించింది. అన్ని ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెడ్ కాలేజీలు విద్యార్థులకు జూన్ 1 వరకు సెలవులు ఇవ్వాలని స్పష్టం చేసింది. అనధికారంగా క్లాసులు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. వేసవి సెలవుల్లో విద్యార్థులు స్కిల్ డెవలప్‌మెంట్, సెల్ఫ్ స్టడీపై దృష్టి పెట్టాలని బోర్డు సూచించింది.