News March 30, 2025

VJA: శరవేగంగా విమానాశ్రయ ఇంటిగ్రేటెడ్‌ టెర్మినల్‌ పనులు

image

విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయ ఇంటిగ్రేటెడ్‌ టెర్మినల్‌ పనులు ప్రస్తుతం శరవేగంగా సాగుతున్నాయి. ఈ పనులు రానున్న 3 నెలల్లో పూర్తిచేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. రూ.540 కోట్ల అంచనా వ్యయంతో మొదలైన ఈ పనులను త్వరితగతిన పూర్తిచేయాలని గుత్తేదారుకు ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. కూచిపూడి, అమరావతి థీమ్‌తో రాష్ట్ర సంస్కృతిని ప్రతిబింబించేలా ఈ టెర్మినల్ నిర్మించాలని ప్రభుత్వం యోచిస్తోంది.

Similar News

News November 10, 2025

INTERESTING: అరటిపండు తినలేనోడు.. విమానాన్ని తినేశాడు

image

ప్లేట్లు, పలు వస్తువులు తినే వాళ్లను సినిమాల్లో చూస్తుంటాం. అలాంటి లక్షణాలున్న వ్యక్తి మిచెల్ లోటిటో. ఫ్రాన్స్‌లో 1950లో పుట్టారు. 9 ఏళ్ల వయసు నుంచే గాజు, ఇనుప పదార్థాలను తినడం మొదలుపెట్టారు. పికా అనే ప్రత్యేక వ్యవస్థతో లోటిటో బాడీ నిర్మితమైందని వైద్యులు తెలిపారు. ఆయన ఓ విమానాన్ని రెండేళ్లలో పూర్తిగా తినేశారు. సైకిల్స్, టీవీలు తినే లోటిటో 2006లో మరణించారు. అయితే ఆయన అరటిపండు తినలేకపోయేవారు.

News November 10, 2025

కామారెడ్డి: బీసీ ప్రజలని ఏకం చేస్తాం: విశారదన్ మహారాజ్

image

తెలంగాణ రాష్ట్రంలోని అన్ని అగ్రకుల రాజకీయ పార్టీలు BCలని చిన్న చూపు చూస్తున్నాయని ధర్మ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు విశారదన్ మహారాజ్ ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం జిల్లాలోని R&B గెస్ట్ హౌస్‌లో నిర్వహించిన BC సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. రాష్ట్రంలో ఉన్న BC ప్రజలను ఏకతాటి పైకి తేవడానికి అన్ని జిల్లాలో సదస్సులు నిర్వహిస్తామన్నారు.

News November 10, 2025

నల్గొండ జిల్లాలో నేటి ముఖ్యాంశాలు

image

→ మిర్యాలగూడ: అమానుషం.. కుక్క నోట్లో మృతశిశువు
→ నల్గొండ: ప్రజావాణికి 94 దరఖాస్తులు
→ నార్కట్‌పల్లి: లారీ బోల్తా.. ఉల్లిగడ్డ బస్తాలు ఎత్తుకెళ్ళారు.
→ నల్గొండ: ఇన్‌చార్జి పాలన ఇంకెనాళ్లు?
→ కట్టంగూర్: ఈ సంతకు 75 ఏళ్ల హిస్టరీ
→ నల్గొండ: తగ్గిన ఉష్ణోగ్రతలు.. చలి షురూ
→ నల్గొండ: MGUకి అరుదైన గౌరవం
→ నాగార్జునసాగర్: ఆయకట్టులో జోరుగా వరికోతలు