News March 30, 2025
వనపర్తి: పెబ్బేర్‌లో 41.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు

వనపర్తి జిల్లాలో 20 ఉష్ణోగ్రత నమోదు కేంద్రాల్లో గడచిన 24 గంటల్లో ఉష్ణోగ్రతలో కింది విధంగా నమోదయ్యాయి. అత్యధికంగా అమరచింత, పెబ్బేరులో 41.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది. దగడ 41.2, శ్రీరంగాపూర్ 41.2, ఆత్మకూరు 41.2, వెలుగొండ 41.2, కేతపల్లి 40.9, రేమోద్దుల 40.9, రేవల్లి 40.8, పెద్దమందడి 40.7, జానంపేట 40.7, వీపనగండ్ల 40.7, వనపర్తి 40.5, గోపాల్‌పేట 40.5 డిగ్రీలుగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
Similar News
News April 2, 2025
KMR: సన్నం బియ్యం పంపిణీ ప్రారంభించిన కలెక్టర్

కామారెడ్డి మున్సిపాలిటీ పరిధిలో సన్నం బియ్యం పథకాన్ని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా బియ్యం నాణ్యతను, తూకాన్ని ఆయన పరిశీలించారు. లబ్ధిదారులతో నేరుగా మాట్లాడి వారి అభిప్రాయాన్ని తెలుసుకున్నారు. ఈ పథకం ద్వారా అర్హులైన ప్రతి ఒక్కరికీ సన్న బియ్యం అందుతాయని కలెక్టర్ తెలిపారు. పంపిణీ ప్రక్రియ సజావుగా జరిగేలా రేషన్ షాపుల్లో అధికారులతో తనిఖీలు చేయించినట్లు పేర్కొన్నారు.
News April 2, 2025
రెవెన్యూ సేవలలో జాప్యం వద్దు: అనకాపల్లి కలెక్టర్

రెవెన్యూ సేవలలో జాప్యం ఉండకూడదని అనకాపల్లి జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్ అన్నారు. కలెక్టరేట్ నుంచి బుధవారం రెవెన్యూ శాఖకు సంబంధించిన రీసర్వే మ్యూటేషన్లు, ఇంటి స్థలాల క్రమబద్ధీకరణ, నీటి తీరవా వసూళ్లు తదితర అంశాలపై తహశీల్దారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. రెవెన్యూ సమస్యలపై వచ్చిన దరఖాస్తులను పరిశీలించి సకాలంలో చర్యలు తీసుకోవాలన్నారు. రీ సర్వే పనులను వేగవంతం చేయాలన్నారు.
News April 2, 2025
బస్సుల అనుమతులకు రిమార్కులు అందించండి- కలెక్టర్

రవాణా శాఖ అధికారులతో గుంటూరు కలెక్టర్ కార్యాలయంలో బుధవారం సమావేశం నిర్వహించారు. గుంటూరులో ప్రైవేటు సిటీ బస్సుల రూట్ల అనుమతులకు సంబంధించి సమావేశం నిర్వహించినట్లు కలెక్టర్ నాగలక్ష్మి తెలిపారు. కలెక్టర్, ఎస్పీ సతీష్ కుమార్ మాట్లాడుతూ.. సిటీ బస్సుల అనుమతులకు సంబంధించి ఆర్టీసీ అధికారులు ఏప్రిల్ 9 నాటికి రిమార్కులు అందించాలని ఆదేశించారు. అనంతరం అనుమతుల మంజూరుకు ఆర్‌టీఏ కమిటీ చర్యలు తీసుకుంటుందన్నారు.