News March 30, 2025
మారు తల్లి కొట్టడంతో బాలుడి మృతి, మరో బాలుడికి గాయాలు

పల్నాడు జిల్లా ఎడ్లపాడు(మ) కొండవీడు వద్ద గొల్లపాలెంలో కవల పిల్లల్ని మారు తల్లి కొట్టడంతో చనిపోయిన ఘటన చోటుచేసుకుంది. కొండవీడుకి చెందిన కంచర్ల సాగర్, లక్ష్మి అనే మహిళను 2వ వివాహం చేసుకున్నాడు. సాగర్ మొదటి భార్యకి ఇద్దరు కవలలు పుట్టగా, ఆమె అనారోగ్యంతో చనిపోయింది. రెండడో భార్య లక్ష్మి మొదటి భార్య పిల్లలను.. ఓ బాబుని గోడకేసి కొట్టడం వల్ల తల పగిలి అక్కడకక్కడే చనిపోగా, మరో బాలుడికి తీవ్ర గాయాలయ్యాయి.
Similar News
News November 3, 2025
ఢిల్లీలో కాలుష్య నివారణ చర్యలపై అఫిడవిట్ ఇవ్వండి: సుప్రీం

ఢిల్లీలో వాయుకాలుష్య నివారణకు తీసుకుంటున్న చర్యలపై అఫిడవిట్ సమర్పించాలని సుప్రీంకోర్టు కమిషన్ ఫర్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంటును ఆదేశించింది. వాయు పర్యవేక్షణ కేంద్రాలు పనిచేయడం లేదన్న మీడియా వార్తలపై ప్రశ్నించింది. CPCB, DPCC, NCR పరిధిలోకి వచ్చే జిల్లాల్లో OCT 14-25 మధ్య పరీక్షించిన గాలి నాణ్యత నివేదికల్ని సమర్పించాలని చెప్పింది. CJI గవాయ్, జస్టిస్ వినోద్ చంద్రన్ ఈ కేసును విచారించి ఆదేశాలిచ్చారు.
News November 3, 2025
మెదక్: ప్రజావాణిలో 77 దరఖాస్తులు

మెదక్ కలెక్టరెట్‌లోని ప్రజావాణిలో మొత్తం 77 దరఖాస్తులు స్వీకరించినట్లు అదనపు కలెక్టర్ నగేష్ తెలిపారు. వీటిల్లో భూ సమస్యలకు సంబంధించి 36, పింఛన్లకు సంబంధించి 07, ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి 07, దరఖాస్తులు వచ్చాయన్నారు. మిగిలిన 27 దరఖాస్తులు ఇతర సమస్యలకు సంబంధించినవని పేర్కొన్నారు. ప్రజావాణి దరఖాస్తులను పరిశీలించి సత్వరమే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.
News November 3, 2025
మట్టి నింపిన బావులపై ఇల్లు కట్టుకోవచ్చా?

లోతట్టు ప్రాంతాల్లో ఇంటి నిర్మాణం సురక్షితం కాదని వాస్తు నిపుణులు కృష్ణాదిశేషు సూచించారు. మట్టి నింపిన బావులు, గుంటలపై ఉండే ఇల్లు ప్రమాదానికి సంకేతమన్నారు. ‘ఈ స్థలాల్లో పునాదులు నిలవలేవు. భూమి జారే అవకాశముంది. నీరు నిలిచి ప్రతికూల శక్తి పెరుగుతుంది. ఇది నివాసితుల ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. ఇంటికి స్థిరత్వం, నివాసితులకు ఆరోగ్యం సిద్ధించాలంటే ఇలాంటి భూములను విడిచిపెట్టాలి’ అని సూచించారు. <<-se>>#Vasthu<<>>


