News March 26, 2024
దాడి చేసింది ఐస్లామిక్ స్టేటే: మాక్రాన్

రష్యాపై ఉగ్రదాడి ఇస్లామిక్ స్టేట్ పనేనని ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మానుయేల్ మాక్రాన్ తాజాగా తేల్చిచెప్పారు. అందుకు తమ వద్ద ఆధారాలున్నాయన్నారు. ‘దాడులు చేసింది తామేనని ఐసిస్ స్వయంగా ప్రకటించింది. మా నిఘా వర్గాలు కూడా అదే తేల్చాయి. ఈ దాడిని ఉక్రెయిన్‌పైకి నెట్టాలని రష్యా భావిస్తే అది మూర్ఖత్వమే కాదు, ఆ దేశ భద్రతకు ప్రమాదం కూడా. ఐసిస్ గతంలో మాపైనా దాడికి యత్నించింది’ అని మాక్రాన్ వెల్లడించారు.
Similar News
News November 12, 2025
ఎగ్జిట్ పోల్స్: 2015, 2020లో ఏం జరిగింది?

బిహార్ ప్రజల నాడిని ఎగ్జిట్ పోల్స్ పట్టలేకపోతున్నాయని 2015, 2020 ఎన్నికల ఫలితాల్లో తేలింది. 2015లో మహాఘట్‌బంధన్(JDU+RJD+INC), NDAకు గట్టి పోటీ ఉంటుందని 6 మేజర్ ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. అయితే MGB 178 సీట్లు గెలవగా, NDA 58 సీట్లకు పరిమితమైంది. 2020లో MGB(INC+RJD)దే గెలుపని 11 ఎగ్జిట్ పోల్స్ చెప్పాయి. అయితే JDUతో కూడిన NDA 125 సీట్లతో అధికారంలోకి వచ్చింది.
* మరి ఈసారి తీర్పు ఎలా వస్తుందో?
News November 12, 2025
ఎల్లుండి నుంచి టెన్త్ పరీక్షల ఫీజు స్వీకరణ

AP: టెన్త్ పరీక్షల ఫీజును ఎల్లుండి(NOV 13) నుంచి ఈ నెల 25 వరకు స్వీకరిస్తామని విద్యాశాఖ తెలిపింది. రెగ్యులర్, ఒకేషనల్, గతంలో టెన్త్ ఫెయిలైన వారు ఫీజును చెల్లించవచ్చని పేర్కొంది. లేట్ ఫీ రూ.50తో డిసెంబర్ 3 వరకు, రూ.200తో డిసెంబర్ 10 వరకు, రూ.500తో డిసెంబర్ 15 వరకు అవకాశం ఉంటుందని వెల్లడించింది. స్కూల్ హెడ్ మాస్టర్లు https://bse.ap.gov.in/లో స్కూల్ లాగిన్ ద్వారా ఫీజును చెల్లించాల్సి ఉంటుంది.
News November 12, 2025
IPL: ఫ్రాంచైజీలు రిలీజ్ చేసేది వీరినేనా?

CSK: శంకర్, కాన్వే, హుడా, అశ్విన్, త్రిపాఠి
DC: ముకేశ్, చమీర, నటరాజన్, మోహిత్, డుప్లెసిస్
GT: రషీద్, షారుక్, ఇషాంత్, Tewatia
KKR: V iyer, అలీ, డికాక్, రమణ్
LSG: షమర్, సమద్, MI: D చాహర్, Topley, ముజీబ్
PBKS: Maxy, స్టొయినిస్, Ferguson, Jamieson
RR: మధ్వాల్, ఫారూఖీ, బర్గర్, తీక్షణ, Hetmyer, తుషార్
SRH: Ishan, shami, జంపా, అభినవ్, R చాహర్, హర్షల్
RCB: పడిక్కల్, షెపర్డ్, రసిఖ్, సుయాశ్, లివింగ్‌స్టోన్


