News March 30, 2025
ఏలూరు: జైల్లో శాంతకుమారి మృతి.. మిస్టరీ ఏమిటి?

ఏలూరు జిల్లా జైలులో ఆదివారం ఉదయం హత్య కేసులో శిక్ష అనుభవిస్తున్న శాంత కుమారి మృతి చెందింది. అయితే జైల్లో అనేక కట్టుదిట్టమైన భద్రతలు ఉంటాయి. ఇటువంటి తరుణంలో జైల్లో ఉరివేసుకుని మృతి చెందటం పలు అనుమానాలకు దారితీస్తుంది. శాంతికుమారి మృతి పలు రాజకీయ కోణాలతో మిస్టరీగా ఏర్పడింది. శాంతి కుమారి తన భర్తను హత్య చేసినట్లు ఒప్పుకోవడంతో చిక్కుముడి వీడింది. శాంత కుమారి మృతి వెనక మిస్టరీ ఏమిటనేది తెలియాల్సి ఉంది.
Similar News
News April 2, 2025
కర్నూలు-విజయవాడ మధ్య విమాన సర్వీసులకై విజ్ఞప్తి

AP: కర్నూలు నుంచి విజయవాడకు విమాన సర్వీసులు నడపాలని కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడిని రాష్ట్ర మంత్రి టీజీ భరత్ కోరారు. ఢిల్లీలో కేంద్రమంత్రిని కలిసి ఈ మేరకు విజ్ఞప్తి చేయగా, ఆయన సానుకూలంగా స్పందించారు. ఓర్వకల్లు ఇండస్ట్రియల్ హబ్‌లో పరిశ్రమల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని వివరించారు. విమాన సర్వీసులూ అందుబాటులోకి వస్తే పారిశ్రామికవేత్తల రాకపోకలకు సౌకర్యంగా ఉంటుందన్నారు.
News April 2, 2025
జిల్లా అధికారులతో కలెక్టర్ సమీక్ష సమావేశం

సూర్యాపేట కలెక్టరేట్‌లో మున్సిపల్ కమిషనర్లు ఎంపీడీవోలు, డీపీఎంలు, ఏపీవోలు, అధికారులతో రాజీవ్ యువ వికాస పథకం అమలు, వివిధ అంశాలపై బుధవారం కలెక్టర్ తేజ్ నందలాల్ పవార్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ముందుగా మునగాల మండలంలోని ఎంపీఓ ధార శ్రీనివాసరావు మృతి పట్ల కలెక్టర్ సంతాపం వ్యక్తం చేశారు. అనంతరం అధికారులకు పలు సూచలు చేశారు.
News April 2, 2025
ఈతకు వెళ్లి ఇద్దరు విద్యార్థులు మృతి

ఈతకు వెళ్లి ఇద్దరు యువకులు మృతి చెందిన ఘటన భూదాన్ పోచంపల్లి మండలంలో జరిగింది. మండల పరిధిలోని దేశ్‌ముఖి గ్రామంలో పడవు పడిన ఓ క్వారీ గుంతలో ఈతకు వెళ్లి బీటెక్ ఫస్ట్ ఇయర్‌కి చదువుతున్న గంద జయన్ (18), బొడ్డు శ్యామ్ శరన్ (18) అనే ఇద్దరు విద్యార్థులు మృతి చెందారు. మొత్తం నలుగురు విద్యార్థులు మధ్యాహ్నం ఈతకు వెళ్లారు. అందులో ఇద్దరు ఈతరాక నీటిలో మునిగిపోయారు. పోలీసులు మృతదేహాల కోసం గాలిస్తున్నారు.