News March 30, 2025
జహీరాబాద్‌లో మహిళ దారుణ హత్య

మహిళ దారుణహత్యకు గురైన ఘటన జహీరాబాద్ పట్టణం పస్తాపూర్‌లో ఆదివారం జరిగింది. పోలీసుల వివరాలు.. మహిళ కళ్లల్లో కారం చల్లి దారుణ హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. మృతురాలు ఝరాసంగం మండలం చీల మామిడికి చెందిన లక్ష్మి (55)గా గుర్తించారు. ఘటన స్థలాన్ని డీఎస్పీ రామ్మోహన్ రెడ్డి సందర్శించి హత్యకు గల కారణాలను పరిశీలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ కాశీనాథ్ తెలిపారు.
Similar News
News July 4, 2025
హైకోర్ట్ అసోసియేషన్ అధ్యక్షుడికి వేములవాడ రాజన్న ప్రసాదం

హైకోర్టు అడ్వకేట్ అసోసియేషన్ అధ్యక్షుడు అనుముల జగన్‌ను వేములవాడ బార్ అసోసియేషన్ సభ్యులు శుక్రవారం హైదరాబాద్ లో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయనకు శ్రీ రాజరాజేశ్వర స్వామి లడ్డు ప్రసాదం అందజేశారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు గుండా రవి, ప్రధాన కార్యదర్శి సత్యనారాయణ, ఉపాధ్యక్షుడు జనార్ధన్ ,బార్ అసోసియేషన్ కార్యవర్గ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.
News July 4, 2025
విశాఖలో ఏడో తరగతి బాలికపై అత్యాచార యత్నం

రణస్థలం ప్రాంతానికి చెందిన పిన్నింటి చంద్రశేఖర్ (26) డెలివరీ బాయ్‌గా పనిచేస్తూ రేసపువానిపాలెం వినాయకనగర్ వద్ద నివాసం ఉంటున్నాడు. తన ఇంటి కింద నివసిస్తున్న ఏడో తరగతి చదువుతున్న బాలికను గదికి రప్పించి అత్యాచారం చేసేందుకు ప్రయత్నించాడు. బాలిక తల్లిదండ్రులకు చెప్పడంతో త్రీ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న ట్రీ టౌన్ పోలీసులు నిందితుడిని రిమాండ్‌కి తరలించారు.
News July 4, 2025
లక్ష్మీ బ్యారేజీలో గోదావరి నదికి వరద తగ్గుముఖం

మేడిగడ్డ లక్ష్మి బ్యారేజీలో గోదావరి నదికి శుక్రవారం సాయంత్రం నుంచి వరద ప్రవాహం తగ్గుముఖం పట్టింది. రెండు రోజులుగా భారీగా వరద ఉద్ధృతి నెలకొనగా.. శుక్రవారం ఉదయం 84,500 క్యూసెక్కుల వరద ప్రవాహం ఉంది. సాయంత్రం 6 గంటలకు 72,500 క్యూసెక్కుల వరద ప్రవాహం కొనసాగుతోందని నీటి పారుదల శాఖ అధికారులు తెలిపారు.