News March 30, 2025
ప్రశాంతంగా కొనసాగుతున్న ఫకీర్ షావలి జాతర

హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలం దామెర గ్రామంలో ఫకీర్ షా వలి జాతర ప్రశాంతంగా నిర్వహిస్తున్నారు. హిందూ, ముస్లింలు సంయుక్తంగా జరుపుకొంటున్న ఈ జాతర ప్రశాంతంగా నిర్వహించేందుకు ఎల్కతుర్తి ఎస్ఐ ఆధ్వర్యంలో ప్రత్యేక బందోబస్త్ ఏర్పాటు చేశారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటున్నారు.
Similar News
News April 2, 2025
జిల్లా అధికారులతో కలెక్టర్ సమీక్ష సమావేశం

సూర్యాపేట కలెక్టరేట్‌లో మున్సిపల్ కమిషనర్లు ఎంపీడీవోలు, డీపీఎంలు, ఏపీవోలు, అధికారులతో రాజీవ్ యువ వికాస పథకం అమలు, వివిధ అంశాలపై బుధవారం కలెక్టర్ తేజ్ నందలాల్ పవార్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ముందుగా మునగాల మండలంలోని ఎంపీఓ ధార శ్రీనివాసరావు మృతి పట్ల కలెక్టర్ సంతాపం వ్యక్తం చేశారు. అనంతరం అధికారులకు పలు సూచలు చేశారు.
News April 2, 2025
ఈతకు వెళ్లి ఇద్దరు విద్యార్థులు మృతి

ఈతకు వెళ్లి ఇద్దరు యువకులు మృతి చెందిన ఘటన భూదాన్ పోచంపల్లి మండలంలో జరిగింది. మండల పరిధిలోని దేశ్‌ముఖి గ్రామంలో పడవు పడిన ఓ క్వారీ గుంతలో ఈతకు వెళ్లి బీటెక్ ఫస్ట్ ఇయర్‌కి చదువుతున్న గంద జయన్ (18), బొడ్డు శ్యామ్ శరన్ (18) అనే ఇద్దరు విద్యార్థులు మృతి చెందారు. మొత్తం నలుగురు విద్యార్థులు మధ్యాహ్నం ఈతకు వెళ్లారు. అందులో ఇద్దరు ఈతరాక నీటిలో మునిగిపోయారు. పోలీసులు మృతదేహాల కోసం గాలిస్తున్నారు.
News April 2, 2025
వైల్డ్‌లైఫ్ చీఫ్ వార్డెన్‌కు బీఆర్ఎస్ ఫిర్యాదు

వైల్డ్‌లైఫ్ చీఫ్ వార్డెన్ మెరూను ఆర్‌ఎస్. ప్రవీణ్ కుమార్, బీఆర్ఎస్ ప్రతినిధి బృందం అరణ్య భవన్‌లో కలిశారు. హెచ్సీయూ పరిధిలో వివిధ జంతు- వృక్ష జాతుల మనుగడకు హాని కలిగించే చర్యలను తక్షణమే అడ్డుకోవాలని వినతిపత్రం అందజేశారు. అటవీ, పర్యావరణ పరిరక్షణ చట్టాలను కంచ గచ్చిబౌలిలోని 400 ఎకరాల్లో రాష్ట్ర ప్రభుత్వం యథేచ్ఛగా ఉల్లంఘిస్తుండటంపై ఫిర్యాదు చేశారు. తక్షణ చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు.