News March 30, 2025

బాపట్ల కలెక్టరేట్‌లో ఘనంగా ఉగాది వేడుకలు

image

బాపట్ల జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో విశ్వావసు నామ సంవత్సర ఉగాది వేడుకలు ఆదివారం ఘనంగా నిర్వహించారు. కలెక్టరేట్లో నిర్వహించిన ఉగాది వేడుకలను బాపట్ల జిల్లా కలెక్టర్ వెంకట మురళి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. అనంతరం వేద పండితుల నడుమ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బాపట్ల ఎమ్మెల్యే వేగేశన నరేంద్ర వర్మ, జాయింట్ కలెక్టర్ ప్రకార్ జైన్, జిల్లా అధికారులు పాల్గొన్నారు.

Similar News

News November 16, 2025

టెస్టుకు దూరమైన గిల్

image

టీమ్ ఇండియా కెప్టెన్ గిల్ ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు. దీంతో సౌతాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టులో ఆయన పాల్గొనరని BCCI వెల్లడించింది. రెండో రోజు బ్యాటింగ్ చేస్తూ గిల్ మెడనొప్పితో మైదానాన్ని వీడారు. అటు ఇవాళ మూడో రోజు ఆట ప్రారంభమైంది. రెండో ఇన్నింగ్సులో సౌతాఫ్రికా స్కోర్ 93/7గా ఉంది.

News November 16, 2025

ఫోన్ కోసం అలిగి.. బాలుడు అదృశ్యం: ఎస్ఐ

image

సెల్ ఫోన్ చూడవద్దని తల్లి మందలించడంతో ఓ బాలుడు (11) అలిగి ఇంటి నుంచి వెళ్లిపోయిన ఘటన నరసాపురంలో చోటుచేసుకుంది. ఈ నెల 14న బాలుడు ఫోన్ పగులగొట్టి వెళ్లిపోయాడని, తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని ఎస్సై జయలక్ష్మి తెలిపారు. బాలుడి ఆచూకీ కోసం పట్టణం, పరిసర ప్రాంతాల్లోని సీసీ కెమెరాల ఆధారంగా ముమ్మరంగా గాలిస్తున్నట్లు పోలీసులు వివరించారు.

News November 16, 2025

పెద్దపల్లి: ఈ మండలాల్లో రిపోర్టర్లు కావలెను..!

image

పెద్దపల్లి జిల్లా అంతర్గాం, ముత్తారం మంథని, కమాన్ పూర్, సుల్తానాబాద్, జూలపల్లి, ఎలిగేడు మండలాల నుంచి రిపోర్టర్ల కోసం Way2News దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. అనుభవం ఉన్న వారు మాత్రమే ఈ లింకుపై <>క్లిక్<<>> చేసి వివరాలు నమోదు చేయండి.