News March 30, 2025
హైదరాబాద్‌లో రోడ్లు ఖాళీ..!

హైదరాబాద్ మహానగరంలోని రోడ్లన్నీ ఖాళీగా దర్శనమిస్తున్నాయి. నగరంలో ఎండ తీవ్రతతో జనం బయటకు రావడానికి జంకుతున్నారు. మరికొందరు ఉగాదికి సొంతూళ్లకు వెళ్లారు. దీంతో నగరంలోని అన్ని ప్రధాన రోడ్లు నిర్మానుష్యంగా కనిపిస్తున్నాయి. సెలవు దినాల్లో నిత్యం రద్దీగా ఉండే సెక్రటేరియట్, ట్యాంక్ బండ్ పరిసరాలు బోసిపోయాయి. రోడ్లపై వాహనాల రద్దీ తగ్గింది. మరి మీ ఏరియాలో ఎలా ఉందో కామెంట్ చేయండి.
Similar News
News November 4, 2025
జూరాల వంతెన టెండర్లకు ఈరోజే లాస్ట్

జూరాల ప్రాజెక్ట్ దిగువన రేవులపల్లి-నందిమల్ల వద్ద వంతెన నిర్మిస్తామని మొదట జీవో NO:292 ప్రభుత్వం జారీ చేసింది. మళ్లీ కొన్ని రోజులకు కొత్తపల్లి-జూరాల మధ్య వంతెన నిర్మిస్తునట్లు మరో జీవో ఇచ్చింది. దీంతో ధరూర్, కేటిదొడ్డి, అమరచింత మండలాల ప్రజలు ఆశలు ఆవిరైపోయాయి. వివిధ అంశాలను పరిగణలోకి తీసుకోని కొత్తపల్లి-జూరాల వద్దే నిర్మించేందుకు ప్రభుత్వం మొగ్గు చూపింది. టెండర్ల గడువు కూడా నేటితో ముగియనుంది.
News November 4, 2025
నరసరావుపేట: తన ఆధార్‌తో వేరొకరి వ్యాపారం.. డబ్బులు బ్లాక్!

తన పాన్, ఆధార్ కార్డు ఉపయోగించి గుర్తు తెలియని వ్యక్తులు వ్యాపారం నిర్వహిస్తున్నట్లు చిలకలూరిపేటకు చెందిన వ్యక్తి ఎస్పీకి సోమవారం ఫిర్యాదు చేశాడు. తన బ్యాంకు ఖాతా హోల్డ్ చేయమని ఖమ్మం వాణిజ్య పన్నుల శాఖ నుంచి నుంచి నోటీసు వచ్చిందన్నారు. దీంతో బ్యాంక్ అధికారులు తన లావాదేవీలు నిలిపివేసినట్లు వాపోయాడు. స్థలం మీద వచ్చిన రూ.9 లక్షలు బ్యాంకులో బ్లాక్ అయ్యాయని.. న్యాయం చేయాలని కోరాడు.
News November 4, 2025
జగిత్యాల: ‘ప్రజావాణి అర్జీలను వెంటనే పరిష్కరించాలి’

జగిత్యాల కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణిలో మొత్తం 46 ఫిర్యాదులు స్వీకరించామని, వాటిని త్వరితగతిన పరిష్కరించాలని అధికారులకు ఆదేశించామని మెట్‌పల్లి ఆర్డీవో శ్రీనివాస్, కోరుట్ల ఆర్డీవో జీవాకర్ రెడ్డి తెలిపారు. ప్రజల సమస్యలపై సమగ్ర విచారణ జరిపి పెండింగ్‌లో ఉంచకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా అధికారులు పాల్గొన్నారు.


