News March 30, 2025

కొత్త సినిమాను ప్రకటించిన పూరీ

image

దర్శకుడు పూరీ జగన్నాథ్ కొత్త సినిమాను ప్రకటించారు. విజయ్‌ సేతుపతితో కొత్త మూవీని చేయనున్నట్లు పూరీ కనెక్ట్స్ ద్వారా వెల్లడించారు. పలు భాషల్లో ఈ సినిమా రిలీజ్ కానున్నట్లు తెలిపారు. ఈ మేరకు విజయ్, ఛార్మితో కలిసి ఉన్న ఫొటోను షేర్ చేశారు. జూన్‌లో షూటింగ్ ప్రారంభిస్తామని పేర్కొన్నారు. ‘ఇస్మార్ట్ శంకర్’ తర్వాత పూరీ సక్సెస్ కోసం ఎదురుచూస్తున్నారు. ఆ తర్వాత వచ్చిన లైగర్, డబుల్ ఇస్మార్ట్ ఫ్లాపయ్యాయి.

Similar News

News April 4, 2025

‘ఇంపాక్ట్’ చూపించి SRHను ఓడించాడు

image

IPL: కోల్‌కతాతో నిన్న జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ ఘోరంగా ఓడిపోయిన విషయం తెలిసిందే. భారీ టార్గెట్‌తో బరిలోకి దిగిన హైదరాబాద్‌ను KKR ఇంపాక్ట్ ప్లేయర్ వైభవ్ అరోరా కోలుకోలేని దెబ్బతీశారు. ముగ్గురు విధ్వంసకర ఆటగాళ్లు హెడ్, ఇషాన్ కిషన్, క్లాసెన్ వికెట్లు పడగొట్టి హైదరాబాద్ ఓటమిని శాసించారు. POTM అవార్డు సొంతం చేసుకున్నారు. SRH హ్యాట్రిక్ పరాజయాలను మూటగట్టుకుంది.

News April 4, 2025

ఇంటిమేట్ సీన్‌లో ఓ నటుడు హద్దు మీరాడు: హీరోయిన్ అనుప్రియ

image

తన కెరీర్‌లో ఎదురైన చేదు అనుభవాలను హీరోయిన్ అనుప్రియా గోయెంకా పంచుకున్నారు. ఓ ముద్దు సీన్‌లో తాను ఇబ్బంది పడ్డట్లు చెప్పారు. ‘ఓ సినిమాలో కిస్సింగ్ సీన్ చేస్తున్నా. ఆ సమయంలో ఓ నటుడు నా నడుము పట్టుకోవాల్సి ఉంది. స్క్రిప్టులోనూ అదే ఉంది. కానీ అతడు మరో చోట అసభ్యకరంగా తాకడంతో ఇబ్బంది పడ్డా. వెంటనే అతడిని ప్రశ్నించలేకపోయా. కానీ ఆ తర్వాతి టేక్‌లో మాత్రం అలా చేయొద్దని హెచ్చరించా’ అంటూ చెప్పుకొచ్చారు.

News April 4, 2025

కుంభమేళాతో రూ.2.80 లక్షల కోట్ల బిజినెస్

image

ప్రయాగ్ రాజ్‌లో జరిగిన కుంభమేళాతో దేశ ఆర్థిక వ్యవస్థకు మంచి ప్రోత్సాహం లభించినట్లు డన్ అండ్ బ్రాడ్‌స్ట్రీట్ నివేదిక తెలిపింది. ఈ మేళా వల్ల రూ.2.8 లక్షల కోట్ల ఆర్థిక కార్యకలాపాలు జరిగినట్లు వెల్లడించింది. కొనుగోళ్ల రూపంలో రూ.90,000 కోట్లు, ఎయిర్‌లైన్స్, హోటళ్లు తదితర రంగాల ద్వారా రూ.80,000 కోట్ల వ్యాపారం జరిగినట్లు పేర్కొంది. రోజూవారీ అవసరాల కోసం రూ.1.1 లక్షల కోట్ల బిజినెస్ జరిగినట్లు తెలిపింది.

error: Content is protected !!