News March 30, 2025
కల్వకుర్తి యువతికి గ్రూప్ 1లో 45వ ర్యాంకు

కల్వకుర్తి పట్టణానికి చెందిన యువతి గ్రూప్ 1లో 45వ ర్యాంకు సాధించింది. మెడిసిన్ పూర్తి చేసిన సాహితి ఐఏఎస్ సాధించడమే లక్ష్యంగా పోటీ పరీక్షలకు సిద్ధమైంది. మొదటి ప్రయత్నంలోనే గ్రూప్ 1 సాధించిన ఆమెను పలువురు అభినందించారు. ఆమె తల్లిదండ్రులు ఇద్దరూ ప్రభుత్వ ఉపాధ్యాయులు. ఈ సందర్భంగా సాహితి మాట్లాడుతూ ఐఏఎస్ సాధించడమే తన లక్ష్యమని అన్నారు.
Similar News
News April 2, 2025
NTR: అధికారులతో కలెక్టర్ సమీక్షా సమావేశం

ఎన్టఆర్ జిల్లా చందర్లపాడు మండలం ముప్పాళ్ళ గ్రామంలో ఈనెల 5వ తేదీన బాబు జగ్జీవన్ రామ్ జయంతి, ప్రజా వేదిక కార్యక్రమంలో భాగంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటించనున్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ లక్ష్మీశ జిల్లా అన్ని శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. అధికారులు అందరూ సమన్వయంతో పనిచేసి చంద్రబాబు పర్యటన విజయవంతం చేయాలన్నారు.
News April 2, 2025
వనపర్తి: ‘పండిత్ ఉపాధ్యాయులకు జీపీఎఫ్ నంబర్ కేటాయించాలి’

డీఎస్సీ 2002 హిందీ పండిట్‌గా కోర్టు ఉత్తర్వుల ద్వారా ఆలస్యంగా నియమితులైన జిల్లాలోని 8 మంది ఉపాధ్యాయులకు హైకోర్టు ఉత్తర్వుల కనుగుణంగా పాత పెన్షన్ వర్తించేలా జీపీఎఫ్ నంబర్ కేటాయించాలని విద్యాశాఖ అధికారి అబ్దుల్ ఘని ద్వారా ప్రొసీడింగ్స్ ఇప్పించాలని కోరుతూ తపస్ బృందం జడ్పీ డిప్యూటీ సీఈవోకు ఈరోజు వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్, సతీశ్ కుమార్, శశివర్ధన్ పాల్గొన్నారు.
News April 2, 2025
విశాఖలో హత్యకు గురైన విజయనగరం మహిళ

విశాఖపట్నం కొమ్మాది స్వయంకృషినగర్‌లో ప్రేమోన్మాది నవీన్ చేసిన దాడిలో గాయపడ్డ నక్కా దీపిక(20) ప్రస్తుతం ప్రాణాపాయ స్థితిలో ఉంది. ఘటనా స్థలంలోనే ఆమె తల్లి లక్ష్మి (43) మృతి చెందింది. రేగిడి మండలం పుర్లికి చెందిన బాధితురాలి తండ్రి రాజు విశాఖ వలస వచ్చి కారు డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. కొమ్మాదిలోని స్వయంకృషినగర్‌లో అద్దెకు ఉంటున్నారు. యువతి పెళ్ళికి అంగీకరించకపోవటంతో హత్య చేసినట్లు స్థానికులు తెలిపారు.