News March 30, 2025
ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన BHPL కలెక్టర్

ముస్లిం ప్రజలకు జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలియచేస్తూ ఆదివారం ఒక ప్రకటన జారీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రంజాన్ పవిత్రమైన నెలగా, త్యాగం, భక్తి, సహనం, మానవతా విలువల ప్రతీకగా నిలుస్తుందని అన్నారు. ఉపవాస దీక్ష, ప్రార్థనలు, దానం వంటి ఆచారాలు సామాజిక సమగ్రతను పెంపొందిస్తాయని, అందరూ కలిసికట్టుగా సమాజంలో శాంతి, ఐక్యతను చాటాలని పిలుపునిచ్చారు.
Similar News
News April 3, 2025
మారుతీ కార్లు కొనేవారికి షాక్

ఏప్రిల్ 8 నుంచి కార్ల ధరలు పెంచుతున్నట్లు మారుతీ సుజుకీ ప్రకటించింది. మోడల్‌ను బట్టి రూ.2,500 నుంచి రూ.62,000 వరకు ఈ పెంపు ఉంటుందని తెలిపింది. ముడి సరకుల ధరలు, ఆపరేషనల్ కాస్ట్ పెరగడం, కార్లలో మెరుగైన ఫీచర్స్ ఇందుకు కారణమని తెలిపింది. మోడళ్లపై ధరల పెరుగుదల ఇలా ఉంది. SUV Fronx-Rs.2500, Dzire Tour S-Rs.3000, XL6, Ertiga-Rs.12,500, Wagon R-Rs.14000, Eeco van-Rs.22,500, SUV Grand Vitara-Rs.62,000.
News April 3, 2025
MBNR: ‘హాని కలిగించే చర్యలను తక్షణమే అడ్డుకోవాలి’

గచ్చిబౌలిలోని 400 ఎకరాల్లో రాష్ట్ర ప్రభుత్వం యథేచ్ఛగా ఉల్లంఘిస్తుండటంపై వైల్డ్ లైఫ్ చీఫ్ వార్డెన్ మెరూకు MBNR బీఆర్ఎస్ నేత ఆర్ఎస్.ప్రవీణ్ కుమార్ నేతృత్వంలోని బీఆర్ఎస్ ప్రతినిధి బృందం అరణ్య భవన్‌లో ఫిర్యాదు చేశారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ పరిధిలో చట్టాలను ఉల్లంఘించి, వివిధ జంతు, వృక్ష జాతుల మనుగడకు హాని కలిగించే చర్యలను తక్షణమే అడ్డుకోవాలని వినతిపత్రంలో బీఆర్ఎస్ నేతలు కోరారు.
News April 3, 2025
ఇరిగేషన్ మంత్రి నిమ్మలతో బత్తుల భేటీ

రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడును రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్,జిల్లా టీడీపీ అధ్యక్షులు బత్తుల తాతయ్య బాబు మర్యాదపూర్వకంగా కలిశారు. పాలకొల్లులోని వారి క్యాంపు కార్యాలయంలో మంత్రితో భేటీ అయ్యారు.ఈ సందర్భంగా అనకాపల్లి జిల్లాలో వివిధ సమస్యలపై మంత్రితో చర్చించారు. జిల్లాలో పెండింగ్‌లో ఉన్న ఇరిగేషన్ ప్రాజెక్టులు, గ్రోయిన్లకి మరమ్మతులకు నిధులు మంజూరు చేయాలని కోరారు.