News March 30, 2025
అక్టోబర్‌లో ఆసీస్ పర్యటనకు భారత్

ఈ ఏడాది అక్టోబర్, నవంబర్‌లో టీమ్ ఇండియా ఆస్ట్రేలియాలో పర్యటించనుంది. 3 వన్డేలు, ఐదు టీ20లు ఆడనుంది. షెడ్యూల్ ఇలా..
OCT 19: మొదటి వన్డే(పెర్త్)
OCT 23: సెకండ్ వన్డే(అడిలైడ్)
OCT 25: మూడో వన్డే(సిడ్నీ)
OCT 29: ఫస్ట్ టీ20(మనుకా ఓవల్)
OCT 31: రెండో టీ20(MCG)
NOV 2: థర్డ్ టీ20(బెల్లిరివ్ ఓవల్)
NOV 6: నాలుగో టీ20(గోల్డ్ కోస్ట్)
NOV 8: ఫిఫ్త్ టీ20(గబ్బా)
Similar News
News April 2, 2025
వచ్చే ఐదేళ్లలో 20వేల స్టార్టప్‌ల స్థాపనే లక్ష్యం: సీఎం చంద్రబాబు

AP: ప్రభుత్వం తలపెట్టిన ‘రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్’, ‘వన్ ఫ్యామిలీ-వన్ ఆంత్రప్రెన్యూర్’ సంకల్పాల్ని నిజం చేసేందుకు అందరూ ముందుకురావాలని CM చంద్రబాబు పిలుపునిచ్చారు. ‘AP నుంచి కొత్తగా పారిశ్రామిక వేత్తలు రావాలి. ఆవిష్కరణలకు AP హబ్ కావాలి. అందరిలోనూ స్ఫూర్తి నింపేందుకే ఇన్నోవేషన్ హబ్‌కు రతన్ టాటా పేరు పెట్టాం. వచ్చే ఐదేళ్లలో 20వేల స్టార్టప్స్ స్థాపించడమే లక్ష్యం’ అని పేర్కొన్నారు.
News April 2, 2025
మూసీ పరిసరాల్లో నిర్మాణాలపై ఆంక్షలు

TG: మూసీ నది పరిసరాల్లో నిర్మాణాలపై రాష్ట్ర ప్రభుత్వం ఆంక్షలు విధించింది. మూసీకి 50మీటర్ల వరకు బఫర్‌జోన్‌లో నిర్మాణాలు చేపట్టవద్దని, 50-100 మీటర్ల వరకు కొత్త అనుమతులు ఇవ్వొద్దని ఉత్తర్వులు జారీ చేసింది. ప్రణాళికరహిత అభివృద్ధి జరగకుండా DTCP, GHMC చీఫ్ ప్లానర్, HMDA ప్లానింగ్ డైరెక్టర్, మూసీ రివర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ జేఎండీలతో ఓ కమిటీని ఏర్పాటు చేసింది.
News April 2, 2025
IPL: గుజరాత్ టార్గెట్ 170 రన్స్

GTతో మ్యాచులో తొలుత బ్యాటింగ్ చేసిన RCB నిర్ణీత 20 ఓవర్లలో 169-8 స్కోర్ చేసింది. లివింగ్ స్టోన్ (54), జితేశ్ శర్మ (33) రాణించారు. కోహ్లీ (7), సాల్ట్ (14), పడిక్కల్ (4), పాటీదార్ (12) నిరాశపరిచారు. చివర్లో టిమ్ డేవిడ్ (32) మెరుపులు మెరిపించారు. GT బౌలర్లలో సిరాజ్ 3, సాయి కిశోర్ 2 వికెట్లు తీయగా, అర్షద్, ఇషాంత్, ప్రసిద్ధ్ తలో వికెట్ పడగొట్టారు.