News March 30, 2025

నంద్యాల: ఎస్పీ కార్యాలయంలో పీజీఆర్ఎస్ రద్దు

image

నంద్యాల పట్టణంలోని జిల్లా ఎస్పీ కార్యాలయంలో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదికను రద్దు చేస్తున్నట్లు జిల్లా ఎస్పీ ఆదిరాజు సింగ్ రాణా తెలిపారు. సోమవారం రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకుని ఈ కార్యక్రమం రద్దు అయినట్లు ఎస్పీ కార్యాలయ సిబ్బంది తెలిపారు. వచ్చే సోమవారం యధావిధిగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

Similar News

News July 5, 2025

ఉదయాన్నే ఫ్రీ మోషన్ అవ్వాలంటే..

image

చాలామంది ఉదయాన్నే మోషన్ అవ్వక అవస్థలు పడతారు. బలవంతంగా వెళ్లేందుకు కష్టపడుతుంటారు. అయితే పొద్దున్నే గోరువెచ్చని నీళ్లు తాగితే కండరాలు వ్యాకోచించి ఫ్రీగా మోషన్ అవుతుందని హెల్త్ ఎక్స్‌పర్ట్స్ చెబుతున్నారు. ఇక నిత్యం జీర్ణక్రియ సక్రమంగా పనిచేయాలంటే ఫైబర్ అధికంగా ఉండే యాపిల్స్, క్యారెట్, దుంపలు, బఠానీ, బీన్స్, ఓట్స్ తీసుకోవడంతో పాటు నీళ్లు ఎక్కువగా తాగాలని సూచిస్తున్నారు.

News July 5, 2025

9న క్యాబినెట్ సమావేశం

image

AP క్యాబినెట్ సమావేశం ఈ నెల 9న జరగనుంది. వెలగపూడి సచివాలయంలోని మొదటి బ్లాక్‌లో జరిగే ఈ సమావేశంలో చర్చించాల్సిన అంశాలను జులై 7లోగా పంపాలని అన్ని శాఖలను సీఎస్ విజయానంద్ ఆదేశించారు. అన్నదాత-సుఖీభవ, అమరావతిలో అభివృద్ధి పనులు, పోలవరం, విశాఖలో ఐటీ కంపెనీల ఏర్పాటు సహా పలు అంశాలపై చర్చించనున్నారు.

News July 5, 2025

ఏలూరు ఈనెల 14న మెగా జాబ్ మేళా

image

ఏలూరు జిల్లాలోని నిరుద్యోగ యువతీ, యువకులకు సువర్ణావకాశం కల్పిస్తున్నట్లు ఎంపీ మహేశ్ కుమార్ తెలిపారు. ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఈనెల 14న ఏలూరు CR రెడ్డి ఇంజినీరింగ్ కాలేజీలో మేళా నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.10, ఇంటర్, ఐటీఐ, డిప్లమో బీటెక్, డిగ్రీ చేసిన వారు అర్హులన్నారు. రిజిస్టేషన్ కోసం ఈ లింక్ క్లిక్ చేయండి: https://naipunyam.ap.gov.in/user-registration