News March 30, 2025
సూర్యాపేట: కేంద్రమంత్రి బండి సంజయ్‌పై మంత్రి సీతక్క ఫైర్

రాష్ట్రానికి కాంగ్రెస్ కరప్షన్ వైరస్ సోకిందని, రాష్ట్రంలో సన్నబియ్యం కేంద్ర ప్రభుత్వమే ఇస్తుందన్న కేంద్ర మంత్రి బండి సంజయ్ వ్యాఖ్యలపై రాష్ట్ర మంత్రి సీతక్క ఘాటుగా స్పందించారు. ఆదివారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని పటేల్ రమేష్ రెడ్డి నివాసంలో హుజూర్ నగర్‌కు వెళ్తుండగా మాట్లాడారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన 12సంవత్సరాల్లో సన్నబియ్యం ఇవ్వాలని ఆలోచన ఎందుకు రాలేదో చెప్పాలన్నారు.
Similar News
News November 10, 2025
సైబరాబాద్ వ్యాప్తంగా 529 మందిపై కేసు నమోదు

సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని 16 ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో మద్యంతాగి వాహనాలు నడిపే వారిపై కఠినంగా వ్యవహరించారు. 529 మందిపై కేసు నమోదు చేశారు. 417 బైకులు, 24 త్రీ వీలర్స్, 88 కార్లతో పాటు పలు వాహనాలను సీజ్ చేశారు. 20 నుంచి 30 ఏళ్ల వయసు గలిగిన వారే ఎక్కువ శాతం మద్యంతాగి వాహనాలను నడిపినట్లు గుర్తించారు. ఇప్పటికైనా ప్రజలు మారాలని సూచిస్తున్నారు.
News November 10, 2025
అవి శశిథరూర్ వ్యక్తిగత అభిప్రాయాలు: కాంగ్రెస్

బీజేపీ అగ్రనేత అద్వానీపై కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ <<18243287>>ప్రశంసలు<<>> కురిపించడంపై కాంగ్రెస్ పార్టీ స్పందించింది. అవి ఆయన వ్యక్తిగత అభిప్రాయాలు అని వెల్లడించింది. ఆ మాటలకు పార్టీతో సంబంధం లేదని స్పష్టం చేసింది. ప్రజాస్వామ్య స్ఫూర్తిని ఇవి ప్రతిబింబిస్తాయని తెలిపింది. కాంగ్రెస్ పార్టీలో ఉన్న ప్రజాస్వామ్య, ఉదారవాద స్ఫూర్తికి ఈ మాటలు నిదర్శనమని కాంగ్రెస్ నేత పవన్ ఖేడా వెల్లడించారు.
News November 10, 2025
అవాస్తవాలు ప్రచారం చేయద్దు: పలమనేరు DSP

ముసలిమడుగు ఎలిఫెంట్ క్యాంప్ ప్రారంభించడానికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వచ్చిన సంగతి తెలిసిందే. ఆయన తిరుగు ప్రయాణంలో ఇందిరానగర్ వద్ద జరిగిన తోపులాటలో హేమలత అనే మహిళకు స్వల్ప గాయాలయ్యాయి. దీనిని కొంతమంది సోషల్ మీడియాలో కాన్వాయ్ వాహనం ఢీకొనిందని దుష్ప్రచారం చేస్తున్నారు. అది పూర్తిగా అవాస్తవమని DSP ప్రభాకర్ తెలిపారు. ఎవరైనా ఈ విషయంపై మీడియాలో అవాస్తవాలు ప్రచారం చేస్తే చర్యలు తీసుకుంటామన్నారు.


