News March 30, 2025
వనపర్తి: ఉగాది పర్వదినాన..’WAY2NEWS’ తో పూజారి

శ్రీరంగాపూర్(M) తాటిపాముల గ్రామ దేవాలయంలో పూజారి ప్రకాష్ శాస్త్రి శ్రీవిశ్వావసు నామ సంవత్సర ఉగాది ప్రాముఖ్యత, పంచాంగము వివరించారు. ఈ సందర్భంగా ‘Way2news’ తో మాట్లాడుతూ సోమకుడు వేదాలను తస్కరించిన కారణంగా మత్స్యావతారం ధరించిన విష్ణువు అతడిని సంహరించి వాటిని తిరిగి బ్రహ్మదేవుడికి అప్పగించిన సందర్భంగా ‘ఉగాది’ ఆచరణలోకి వచ్చిందని తెలిపారు. ఉగాది షడ్రుచుల విశిష్టతను తెలిపారు.
Similar News
News January 13, 2026
విజయ్‌కు మరోసారి CBI నోటీసులు

కరూర్ తొక్కిసలాట ఘటనలో TVK పార్టీ అధినేత విజయ్‌కు <<18836427>>సీబీఐ<<>> మరోసారి నోటీసులు ఇచ్చింది. ఈనెల 19న విచారణకు రావాలని ఆదేశించింది. కాగా నిన్న విజయ్‌ను సీబీఐ 7 గంటల పాటు ప్రశ్నించింది. గతేడాది జరిగిన ఆ తొక్కిసలాటలో 41 మంది మరణించగా, 60 మందికి పైగా గాయాలయ్యాయి.
News January 13, 2026
కర్నూలు: 95 మంది లబ్ధిదారులకు టిడ్కో గృహాల అందజేత

పేదల సొంతింటి కలను సాకారం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి టీజీ భరత్ అన్నారు. మంగళవారం కర్నూలు నగర శివారులోని జగన్నాథ గట్టు వద్ద నిర్వహించిన టిడ్కో గృహాల పంపిణీ కార్యక్రమంలో ఆయన 95 మంది లబ్ధిదారులకు గృహ మంజూరు పత్రాలు, మెగా కీలు అందజేశారు. టిడ్కో గృహాలకు విద్యుత్, తాగునీరు వంటి మౌలిక సదుపాయాలు కల్పించామన్నారు. ఫిబ్రవరిలో మరో 500 గృహాలు అందజేస్తామన్నారు.
News January 13, 2026
సిరిసిల్ల: ‘రోడ్డు భద్రత చర్యలు పకడ్భందీగా చేపట్టాలి’

రోడ్డు భద్రతా చర్యలు పకడ్బందీగా చేపట్టాలని ఇన్‌ఛార్జ్ కలెక్టర్ గరీమా అగ్రవాల్ ఆదేశించారు. రోడ్డు సేఫ్టీ కమిటీ సమావేశాన్ని జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో మంగళవారం ఆర్అండ్‌బీ, నేషనల్ హైవేస్, పీఆర్, పోలీస్, ట్రాన్స్ పోర్ట్, వైద్యా, ఎక్సైజ్, విద్య, ఆర్టీసీ తదితర శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.


