News March 30, 2025

విజయవాడ దుర్గమ్మ ప్రసాదంలో మేకు

image

విజయవాడ ఇంద్ర కీలాద్రి అధికారుల నిర్లక్ష్యం మరోసారి బయటపడింది. అమ్మవారి ప్రసాదంలో మేకు వచ్చిన ఘటన ఆదివారం వెలుగులోకి వచ్చింది. భక్తుల వివరాల మేరకు.. కొందరు భక్తులు శుక్రవారం అమ్మవారిని దర్శించుకోవడానికి వచ్చారు. అనంతరం వారు మహా మండపం కింద 4 వ ప్రసాదం కౌంటర్‌లో పులిహోర పొట్లాలు కొనుగోలు చేశారు. వారు ప్రసాదం తింటుండగా మేకు రావడంతో అసహనం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Similar News

News September 19, 2025

విద్యార్థిని కొట్టిన హెచ్ఎం.. ఏలూరులో ఆందోళన

image

‘డీ’ అక్షరాన్ని సరిగ్గా పలకలేదన్న కారణంతో ఆరో తరగతి విద్యార్థి ఆహిల్‌ను ఓ ప్రైవేటు పాఠశాల ప్రధానోపాధ్యాయుడు కొట్టిన ఘటన ఏలూరులోని తంగెళ్లమూడిలో శుక్రవారం చోటు చేసుకుంది. ఆగ్రహించిన కుటుంబ సభ్యులు శుక్రవారం పాఠశాల ముందు ఆందోళన చేపట్టారు. అనంతరం ప్రధానోపాధ్యాయుడికి దేహశుద్ధి చేశారు. గతంలోనూ ఇలాంటి ఆరోపణలు ఉన్నాయని, ఆయన పద్ధతి మారలేదని విమర్శించారు. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.

News September 19, 2025

వనపర్తి జిల్లా కోర్టులో వైద్య శిబిరం

image

వనపర్తి జిల్లా కోర్టుల సముదాయంలో ‘అబ్జర్వేషన్ ఆఫ్ వరల్డ్ డేఫ్ డే’ సందర్భంగా శనివారం వైద్య శిబిరం నిర్వహించనున్నారు. జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ చైర్మన్ సునీత, కార్యదర్శి రజిని ఆదేశాలతో శిబిరం జరగనుందని న్యాయశాఖ ఉద్యోగుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కోటేశ్వర్ రెడ్డి తెలిపారు. న్యాయ అవగాహన కార్యక్రమం, మానసిక వైద్యుల సేవలు అందుబాటులో ఉండనుందన్నారు. కోర్టు ఉద్యోగులు, న్యాయవాదులు పాల్గొన్నాలన్నారు.

News September 19, 2025

ఉద్యోగుల సమస్యలు వెంటనే పరిష్కారించాలి: కలెక్టర్

image

ఉద్యోగుల వ్యక్తిగత సమస్యల పరిష్కారానికి వెంటనే చర్యలు తీసుకోవాలని అనకాపల్లి కలెక్టరు విజయ కృష్ణన్ అధికారులను ఆదేశించారు. తన కార్యాలయలో ప్రభుత్వ ఉద్యోగుల వ్యక్తిగత సమస్యల పరిష్కారానికి శుక్రవారం గ్రీవెన్స్ నిర్వహించారు. పలువురు ఉద్యోగులు తమ సమస్యలను తెలియజేస్తూ అర్జీలు అందజేశారు. న్యాయమైన, పరిష్కరించుటకు అవకాశం గల సమస్యలను వెంటనే పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.