News March 30, 2025

66 ఏళ్ల వయసులో 10వ బిడ్డకు జన్మ!

image

10మంది పిల్లలకు జన్మనివ్వడమంటేనే కష్టం. ఆ పదో బిడ్డను 66ఏళ్ల వయసులో ప్రసవిస్తే..? జర్మనీకి చెందిన ఆలెగ్జాండ్రా హెల్డెబ్రాండ్ ఇదే ఘనత సాధించారు. ఎటువంటి కృత్రిమ పద్ధతులూ లేకుండా ఆమె సహజంగానే తల్లి కావడం, ప్రసవించడం విశేషం. పండంటి మగబిడ్డకు ఆమె జన్మనిచ్చారని బెర్లిన్‌లోని చారైట్ ఆస్పత్రి వైద్యులు తెలిపారు. అలెగ్జాండ్రా తొలి బిడ్డకు ఇప్పుడు 50 ఏళ్లు కావడం ఆసక్తికరం.

Similar News

News February 7, 2026

Vi నుంచి అన్‌లిమిటెడ్ డేటా ప్లాన్స్!

image

వొడాఫోన్ ఐడియా (Vi) ‘నాన్-స్టాప్ హీరో’ పేరుతో సరికొత్త ప్రీపెయిడ్ ప్లాన్లను అందుబాటులోకి తెచ్చింది. ఇందులో రోజువారీ పరిమితి లేకుండా కాల్స్, అన్‌లిమిటెడ్ 4G/5G డేటా & 100 SMSలు లభిస్తాయి. ముఖ్యంగా రూ.365 (28 రోజులు), రూ.649 (56 రోజులు), రూ.979 (84 రోజులు) ప్లాన్లతో వినియోగదారులు హై-స్పీడ్ ఇంటర్నెట్ ఆస్వాదించవచ్చు. కొన్ని ప్లాన్లలో అమెజాన్ ప్రైమ్, నెట్‌ఫ్లిక్స్ వంటి OTT ప్రయోజనాలు కూడా ఉన్నాయి.

News February 7, 2026

యానిమేషన్ రూపంలో RRR మూవీ: రాజమౌళి

image

Jr.NTR, రామ్ చరణ్ కాంబోలో వచ్చిన RRRపై దర్శక ధీరుడు రాజమౌళి హాలీవుడ్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో బిగ్ అప్‌డేట్ ఇచ్చారు. ‘RRR మూవీకి యానిమేషన్ అడాప్షన్ విషయంలో చర్చలు జరుపుతున్నాం. ఇప్పటికే పలు జపనీస్ కంపెనీలతో మాట్లాడాం. ఇంకా ఏదీ అధికారికంగా ప్రారంభం కాలేదు’ అని తెలిపారు. RRR కథకు ఇది కంటిన్యూషన్‌గా ఉంటుందని సమాచారం. ఇప్పటికే ‘బాహుబలి- ది ఎటర్నల్ వార్ పార్ట్-1’ యానిమేషన్ మూవీ ప్రకటించిన విషయం తెలిసిందే.

News February 7, 2026

ఐటీకి హైటెక్ సిటీ.. క్వాంటమ్‌కి అమరావతి: CBN

image

AP: దేశంలోని మొట్టమొదటి క్వాంటమ్ వ్యాలీకి అమరావతిలో పునాది పడటం గర్వంగా ఉందని సీఎం చంద్రబాబు ట్వీట్ చేశారు. ‘ఐటీ రెవల్యూషన్‌కి హైటెక్ సిటీ ఏం సాధించిందో, క్వాంటమ్ టెక్నాలజీలో అమరావతి అచీవ్ చేస్తుంది. మోదీ నాయకత్వంలో ఆత్మనిర్భర్ వికసిత్ భారత్ వైపు అడుగులేస్తున్నాం’ అని పేర్కొన్నారు. క్వాంటమ్ టెక్నాలజీలో నోబెల్ సాధిస్తే రూ.100Cr ఇస్తామని ‘క్వాంటమ్ వ్యాలీ’ ప్రారంభోత్సవ సభలో చెప్పారు.