News March 30, 2025
సన్న బియ్యం పథకాన్ని ఎవరూ రద్దు చేయలేరు: CM రేవంత్

TG: సన్న బియ్యం పథకాన్ని ఎవరూ రద్దు చేయలేరని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. భవిష్యత్తులో ఏ ప్రభుత్వం వచ్చినా ఈ పథకం కొనసాగుతుందని తెలిపారు. కేసీఆర్ హయాంలో రూ.11వేల కోట్ల రుణమాఫీ చేస్తే, తాము అధికారంలోకి వచ్చాక ఆర్నెల్లలోనే రూ.25 వేల కోట్ల రుణమాఫీ చేసిన చరిత్ర తమదని చెప్పారు. రాష్ట్రంలో 3.10 కోట్ల మందికి సన్నబియ్యం ఇస్తామని రేవంత్ పేర్కొన్నారు.
Similar News
News April 3, 2025
ఆరు నెలల్లో రెండు ఎయిర్‌పోర్టులు సాధించాం: కోమటిరెడ్డి

TG: ఆదిలాబాద్ ఎయిర్‌పోర్టుకు IAF గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడంపై మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. 6 నెలల్లో 2 ఎయిర్‌పోర్టులు(మామునూర్, ఆదిలాబాద్) సాధించడం తమ ప్రభుత్వ కృషికి దక్కిన ఫలితమన్నారు. ఎయిర్‌పోర్టుకు కావాల్సిన అన్ని అనుమతులు పొందేలా IAFతో కలిసి తదుపరి కార్యాచరణపై నివేదిక రూపొందిస్తామని మంత్రి చెప్పారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ, కేంద్రమంత్రి రామ్మోహన్‌కు ధన్యవాదాలు తెలిపారు.
News April 3, 2025
IPL: ఆర్సీబీ ఓటమి

బెంగళూరులో ఆర్సీబీతో మ్యాచ్‌లో170 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్ 2 వికెట్ల నష్టానికి సునాయాస విజయాన్ని సాధించింది. సాయి సుదర్శన్(36 బంతుల్లో 49), బట్లర్(39 బంతుల్లో 73) రాణించడంతో 17.5 ఓవర్లలోనే స్కోర్ ఛేదించింది. ఆర్సీబీ బౌలర్లలో భువనేశ్వర్, హేజిల్‌వుడ్ చెరో వికెట్ తీసుకున్నారు.
News April 3, 2025
మారుతీ కార్లు కొనేవారికి షాక్

ఏప్రిల్ 8 నుంచి కార్ల ధరలు పెంచుతున్నట్లు మారుతీ సుజుకీ ప్రకటించింది. మోడల్‌ను బట్టి రూ.2,500 నుంచి రూ.62,000 వరకు ఈ పెంపు ఉంటుందని తెలిపింది. ముడి సరకుల ధరలు, ఆపరేషనల్ కాస్ట్ పెరగడం, కార్లలో మెరుగైన ఫీచర్స్ ఇందుకు కారణమని తెలిపింది. మోడళ్లపై ధరల పెరుగుదల ఇలా ఉంది. SUV Fronx-Rs.2500, Dzire Tour S-Rs.3000, XL6, Ertiga-Rs.12,500, Wagon R-Rs.14000, Eeco van-Rs.22,500, SUV Grand Vitara-Rs.62,000.