News March 30, 2025

ముందస్తు రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన జనగామ కలెక్టర్

image

రంజాన్ పర్వదినం సందర్భంగా ముస్లిం సోదరులకు జనగామ జిల్లా కలెక్టర్ ముందస్తు శుభాకాంక్షలు తెలిపారు. ఈ పవిత్రమైన రంజాన్ మాసం శాంతి, సామరస్యం, ఐక్యతను కలిగించాలని ఆకాంక్షించారు. ప్రజలు ప్రేమ, సహనంతో ఉండాలని, సమాజ అభివృద్ధికి కృషి చేయాలని ఆయన సందేశంలో పేర్కొన్నారు. నెల రోజుల పాటు ముస్లిం సోదరులు కఠినమైన నియమ నిష్టలతో ఎంతో భక్తి శ్రద్ధలతో ఉపవాసాన్ని కొనసాగిస్తారని తెలిపారు.

Similar News

News November 10, 2025

దళిత ఉద్యమ కెరటం కత్తి పద్మారావు

image

సాహిత్యం, దళిత ఉద్యమానికి జీవితాన్ని అంకితం చేసిన వ్యక్తి కత్తి పద్మారావు అని BR అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయ ఉపకులపతి చక్రపాణి, కేంద్రసాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత చంద్రశేఖరరెడ్డి అన్నారు. విమలా స్మారక సాహిత్య జీవిత సాఫల్య పురస్కారం-2025 గుంటూరు(D) పొన్నూరుకు చెందిన పద్మారావుకు ప్రకటించారు. నిన్న అనంతలో జరిగిన సభకు పద్మారావు హాజరు కాలేకపోయారు. పురస్కారాన్ని ఆయన కుమారుడు చేతన్ అందుకున్నారు.

News November 10, 2025

అశువు కవిత్వంలో ఆయనకు ఆయనే సాటి

image

ప్రముఖ కవి, రాష్ట్ర గీత రచయిత అందెశ్రీ(64) కన్నుమూశారు. సిద్దిపేట జిల్లా మద్దూరు మండలం రేబర్తిలో 1961 జూలై 18న జన్మించిన అందెశ్రీ అసలు పేరు ఎల్లయ్య. ఆయనకు ముగ్గురు కూతుళ్లు, ఓ కొడుకు. చిన్నతనంలో గొర్రెల కాపరిగా, కూలీగా పనిచేసిన ఆయన.. పట్టుదలతో చదివి రచయితగా ఎదిగారు. అశువు కవిత్వం చెప్పడంలో ఆయనకు ఆయనే సాటి. తన పాటలతో తెలంగాణ పోరాటంలో కీలకపాత్ర పోషించిన ఆయన సినీ రంగానికి రచయితగా సేవలందించారు.

News November 10, 2025

ఆదిలాబాద్‌‌లో నేటి పత్తి ధర వివరాలు

image

ఆదిలాబాద్ మార్కెట్ యార్డులో పత్తి కొనుగోళ్లు సజావుగా సాగుతున్నాయి. మార్కెట్‌లో సోమవారం సీసీఐ పత్తి ధర క్వింటాల్ రూ.8,110గా, ప్రైవేట్ పత్తి ధర రూ.6,800గా నిర్ణయించారు. శుక్రవారం ధరతో పోలిస్తే సోమవారం సీసీఐ ధరలో ఎలాంటి మార్పులేదు. ప్రైవేటు ధర రూ.50 తగినట్లు వ్యవసాయ మార్కెట్ కమిటీ అధికారులు తెలియజేశారు.