News March 30, 2025
కొత్త రేషన్ కార్డుల్లో 30 లక్షల మంది: సీఎస్

TG: కొత్తగా రేషన్ కార్డుల్లో 30లక్షల మందిని చేర్చనున్నామని సీఎస్ శాంతికుమారి చెప్పారు. హుజూర్ నగర్‌లో జరిగిన సన్నబియ్యం పథకం ప్రారంభోత్సవంలో ఆమె మాట్లాడారు. సన్నబియ్యం పంపిణీతో రాష్ట్ర ప్రభుత్వంపై రూ.2,800 కోట్ల అదనపు భారం పడుతుందని చెప్పారు. కొత్తగా 10 లక్షల రేషన్ కార్డులు జారీ కానున్నట్లు వెల్లడించారు.
Similar News
News February 2, 2026
కేసీఆర్ సిట్ విచారణ.. సీఎం రేవంత్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

TG: KCR సిట్ విచారణపై CM రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘KCRకు నోటీసులు ఇస్తే జాతిపితకు ఇస్తారా అంటున్నారు. ఉద్యమకారులను అవమానిస్తారా అని అడుగుతున్నారు. ఉద్యమకారులు అని వారికి వారే రాసుకుంటున్నారు. శిబుసోరెన్, లాలూ ప్రసాద్ యాదవ్, జయలలిత, యడియూరప్ప వంటి వారు విచారణను ఎదుర్కోలేదా? జడ్జిల ముందు చేతులు కట్టుకొని సమాధానం ఇవ్వలేదా? మనమేమీ అతీతులం కాదు’ అని అన్నారు.
News February 2, 2026
T20WC వార్మప్ మ్యాచ్.. భారత్ భారీ స్కోర్

ICC మెన్స్ T20WC వార్మప్ మ్యాచ్‌లో భారత్-A జట్టు అదరగొట్టింది. USAపై 238/3 స్కోర్ చేసింది. నారాయణ్ జగదీశన్ సెంచరీ(55 బంతుల్లో 104) చేయగా, ప్రియాంశ్ ఆర్య 28(13 B), తిలక్ వర్మ 38(24 B), బదోనీ 60*(26 B) పరుగులతో విరుచుకుపడ్డారు. భారత ఇన్నింగ్స్‌లో 12 సిక్సర్లు, 23 ఫోర్లు నమోదయ్యాయి. అటు USA టీమ్ 9 మంది బౌలర్లను ప్రయోగించినా ప్రభావం చూపలేకపోయింది.
News February 2, 2026
రాష్ట్రంలో 34 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

తెలంగాణ హైకోర్టు 34 ఆఫీస్ సబార్డినేట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. 7వ తరగతి నుంచి పదో తరగతి మధ్య ఏదైనా పరీక్షలో పాసవ్వడంతో పాటు పని అనుభవం గలవారు ఫిబ్రవరి 7 నుంచి 28 వరకు అప్లై చేసుకోవచ్చు. వయసు 18 నుంచి 46ఏళ్ల మధ్య ఉండాలి. రాత పరీక్ష, ఓరల్ ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://tshc.gov.in/


