News March 30, 2025

రాష్ట్రంలోనే రెండవ స్థానంలో ఆళ్లగడ్డ

image

నంద్యాల జిల్లాలో కొద్దిరోజులుగా భానుడు భగభగ మండుతున్నాడు. ఏపీ రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ(APSDMA) గణాంకాల ప్రకారం.. ఆదివారం 41.5°C ఉష్ణోగ్రతతో ఆళ్లగడ్డ రాష్ట్రంలోనే రెండవ స్థానంలో నిలిచింది. దీంతో జిల్లా ప్రజల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. ఎండలు మరింత పెరిగే అవకాశం ఉందని.. ప్రజలు జాగ్రత్తలు పాటించాలని అధికారులు సూచిస్తున్నారు.

Similar News

News April 6, 2025

గుత్తి: యువకుడిపై దూసుకెళ్లిన ట్రాక్టర్

image

గుత్తి మండలం చెర్లోపల్లి గ్రామ సమీపంలో పండగ రోజు ఆదివారం విషాదం చోటుచేసుకుంది. పెద్దొడ్డి గ్రామానికి చెందిన విజయ్ (18) ప్రమాదవశాత్తు ట్రాక్టర్ కింద పడటంతో మృతి చెందాడు. రాళ్లు తీసుకురావడానికి కూలీలతో కలిసి వెళ్లాడు. రాళ్లు వేస్తున్న సమయంలో కింద నిలుచొని ఉన్న విజయ్‌పై ట్రాక్టర్ దూసుకెళ్లింది. దీంతో అతడు అక్కడికక్కడే  మృతి చెందాడు. పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

News April 6, 2025

అమరావతి: వేగంగా గ్లోబల్ మెడ్‌టెక్ ఇన్‌స్టిట్యూట్ నిర్మాణ పనులు  

image

ఏపీ మెడ్‌టెక్‌జోన్ ప్రాంగణంలో గ్లోబల్ మెడ్‌టెక్ ఇన్‌స్టిట్యూట్ నిర్మాణ పనులు వేగంగా కొనసాగుతున్నాయి. ఇప్పటికే ఇది మరో ప్రతిష్ఠాత్మక నిర్మాణంగా నిలుస్తోంది. పూర్తిస్థాయిలో నిర్మాణం పూర్తయిన తర్వాత ఇది రాష్ట్రానికి, దేశానికి సాంకేతిక వైద్య పరికరాల రంగంలో మైలురాయిగా నిలిచే అవకాశం ఉంది. ఈ నిర్మాణం పూర్తయితే ఎలా ఉంటుందో అని ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 

News April 6, 2025

కామారెడ్డి జిల్లాలో నమోదైన ఉష్ణోగ్రత వివరాలు

image

జిల్లా వ్యాప్తంగా శనివారం నమోదైన ఉష్ణోగ్రత వివరాలు అధికారులు వెల్లడించారు అత్యధికంగా బిచ్కుందలో 39.9డిగ్రీలు, మద్నూర్ 39.8, నస్రుల్లాబాద్ 39.5, నిజాంసాగర్ 39, బాన్సువాడ, సదాశివనగర్, డోంగ్లిలో 38, భిక్నూర్ 37.9, పిట్లంలో 37.7 ఉష్ణోగ్రతలు నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. క్రమంగా ఉష్ణోగ్రతలు పెరుగుతున్నందున ప్రజలు జాగ్రత్తలు పాటించాలని అధికారులు సూచించారు.

error: Content is protected !!