News March 30, 2025

జాతర గోడపత్రుల ఆవిష్కరించిన ASF ఎమ్మెల్యే

image

రెబ్బెన మండలం ఇందిరానగర్‌లో వెలసిన శ్రీ కనకదుర్గాదేవి స్వయంభు మహంకాళి దేవస్థానంలో ఏప్రిల్ 12, 13న జరిగే మహంకాళి అమ్మవారి జాతర పోస్టర్లను ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి ఆవిష్కరించారు. ఆలయ ప్రధాన అర్చకులు దేవార వినోద్ మాట్లాడుతూ.. కొమరం భీం జిల్లా భక్తుల కొంగు బంగారంగా ఉన్న కనకదుర్గమ్మ దేవి జాతరకు భక్తులు పెద్దఎత్తున హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.

Similar News

News April 3, 2025

HEADLINES

image

వక్ఫ్ సవరణ బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టిన కేంద్రం
వక్ఫ్ బిల్లుతో ముస్లింలకు మేలు: అమిత్ షా
AP: వచ్చే ఐదేళ్లలో 20వేల స్టార్టప్‌ల స్థాపనే లక్ష్యం: CM CBN
AP: వచ్చే ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలుస్తాం: జగన్
TG: HCU భూములపై విచారణను రేపటికి వాయిదా వేసిన హైకోర్టు
TG: బీసీల డిమాండ్‌ను బీజేపీ పట్టించుకోవాలి: CM రేవంత్
TG: LRS రాయితీ గడువు పొడిగింపు
TG: భవిష్యత్ తరాల కోసం HYDని నాశనం చేస్తారా?: KTR

News April 3, 2025

ఆరు నెలల్లో రెండు ఎయిర్‌పోర్టులు సాధించాం: కోమటిరెడ్డి

image

TG: ఆదిలాబాద్ ఎయిర్‌పోర్టుకు IAF గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడంపై మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. 6 నెలల్లో 2 ఎయిర్‌పోర్టులు(మామునూర్, ఆదిలాబాద్) సాధించడం తమ ప్రభుత్వ కృషికి దక్కిన ఫలితమన్నారు. ఎయిర్‌పోర్టుకు కావాల్సిన అన్ని అనుమతులు పొందేలా IAFతో కలిసి తదుపరి కార్యాచరణపై నివేదిక రూపొందిస్తామని మంత్రి చెప్పారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ, కేంద్రమంత్రి రామ్మోహన్‌కు ధన్యవాదాలు తెలిపారు.

News April 3, 2025

IPL: ఆర్సీబీ ఓటమి

image

బెంగళూరులో ఆర్సీబీతో మ్యాచ్‌లో170 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్ 2 వికెట్ల నష్టానికి సునాయాస విజయాన్ని సాధించింది. సాయి సుదర్శన్(36 బంతుల్లో 49), బట్లర్(39 బంతుల్లో 73) రాణించడంతో 17.5 ఓవర్లలోనే స్కోర్ ఛేదించింది. ఆర్సీబీ బౌలర్లలో భువనేశ్వర్, హేజిల్‌వుడ్ చెరో వికెట్‌ తీసుకున్నారు.

error: Content is protected !!