News March 31, 2025
గోస్పాడు యువకుడికి ఉగాది పురస్కారం

గోస్పాడుకు చెందిన ఆవుల మల్లికార్జున అనే క్రీడాకారుడు జాతీయస్థాయి సీనియర్ పురుషుల బాల్ బ్యాట్మెంటన్ ఛాంపియన్షిప్ లో రజత పథకం సాధించాడు. ఈ సందర్భంగా ఆయనికి ఉగాది సంబరాల్లో భాగంగా క్రీడా ప్రోత్సాహకాన్ని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి అందించారు. కార్యక్రమంలో నంద్యాల జిల్లా కలెక్టర్ రాజకుమారి పాల్గొన్నారు. వారు మాట్లాడుతూ యువకులు క్రీడల్లో రాణించాలని, క్రీడల వల్ల మానసిక ధైర్యం కలుగుతుందన్నారు.
Similar News
News January 16, 2026
నిజామాబాద్ ఫస్ట్.. నల్గొండ సెకండ్

ఖరీఫ్ ధాన్యం కొనుగోళ్లలో నల్గొండ జిల్లా రెండో స్థానంలో నిలిచింది. 5.23 లక్షల టన్నులతో జిల్లా రెండో స్థానంలో ఉండగా, 6.93 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించి నిజామాబాద్ మొదటి స్థానంలో ఉంది. పౌరసరఫరాల శాఖ ధాన్యం కొనుగోలు చేసి రైతులకు వారంలోగా నగదును బ్యాంకు ఖాతాలో జమ చేయడంతో రైతులు ప్రైవేటు వ్యాపారుల వైపు మొగ్గు చూపలేదు.
News January 16, 2026
గుర్ల పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన ఎస్పీ

గుర్ల పోలీస్ స్టేషన్‌ను జిల్లా ఎస్పీ ఏ.ఆర్.దామోదర్ శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టేషన్ పరిసరాలను పరిశీలించారు . పండగ సందర్భంగా ప్రయాణం చేస్తున్న ప్రయాణికులకు తగు సూచనలు సలహాలు ఇచ్చి క్షేమంగా గమ్యస్థానం చేరే విధంగా చూడాలని ఎస్సై నారాయణరావుకు సూచించారు. అనంతరం పోలీస్ సిబ్బందికి స్వీట్లు పంపిణీ చేశారు.
News January 16, 2026
NABARDలో 162 ఉద్యోగాలు.. రేపటి నుంచి దరఖాస్తులు

NABARD 162 డెవలప్‌మెంట్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి షార్ట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. రేపు పూర్తి నోటిఫికేషన్ రానుండటంతో పాటు దరఖాస్తులు ప్రారంభం కానున్నాయి. వయసు 21-35 ఏళ్ల మధ్య ఉండాలి. డిగ్రీలో 50% మార్కులు ఉన్నవారు అప్లై చేసుకోవచ్చు. స్థానిక భాష కచ్చితంగా వచ్చి ఉండాలి. ప్రిలిమినరీ, మెయిన్ ఎగ్జామ్స్, లాంగ్వేజీ ప్రొఫిషియన్సీ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు.


