News March 31, 2025
వనపర్తి: ఇఫ్తార్ విందులో పాల్గొన్న మాజీ ఎంపీ రావుల

ముస్లింలు పవిత్రంగా చేసుకునే పండగనే రంజాన్ అని బీఆర్ఎస్ నాయకులు, మాజీ ఎంపీ రావుల చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. ఆదివారం పెబ్బేరు మసీదులో ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు ఇచ్చి ఉపవాస దీక్షలను విరమింప చేశారు. అనంతరం రావుల ముస్లింలతో మసీదులో ప్రార్థన లు చేశారు. రావుల మాట్లాడుతూ ముస్లింలు దేశం సుభిక్షంగా, సుఖ సంతోషాలతో ఉండేలా ప్రార్థనలు చేయాలని కోరారు. రంజాన్ పండగను ప్రశాంతంగా చేసుకోవాలని అన్నారు.
Similar News
News November 10, 2025
భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు

గత కొన్ని రోజులుగా తగ్గుతూ వస్తోన్న బంగారం ధరలు ఇవాళ భారీగా పెరిగాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,200 పెరిగి రూ.1,23,220కి చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.1,100 ఎగబాకి రూ.1,12,950 పలుకుతోంది. అటు కేజీ వెండిపై రూ.2,000 పెరిగి రూ.1,67,000గా ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలున్నాయి.
News November 10, 2025
NLG: ఈ సంతకు 75 ఏళ్ల హిస్టరీ

రాష్ట్రంలోనే పేరెన్నిక గల కట్టంగూరు పశువుల సంత 75 ఏళ్లు పూర్తి చేసుకొని సరికొత్త రికార్డు సృష్టించింది. 1950లో ఏర్పడిన ఈ సంత 75 ఏళ్లు దాటినా ఏమాత్రం ఆదరణ తగ్గడం లేదు. ప్రతి శనివారం ఇక్కడ వేలాది పశువులు, గొర్రెలు, మేకల క్రయవిక్రయాలు జరుగుతుంటాయి. ఉమ్మడి నల్గొండ జిల్లా నలుమూలల నుంచి దాదాపు 100కు పైగా గ్రామాల నుంచి రైతులు పశువులు, గొర్రెలు, మేకలు విక్రయాల కోసం ఇక్కడికి వస్తుంటారు.
News November 10, 2025
అందెశ్రీ మృతి పట్ల మంత్రి పొన్నం ప్రభాకర్ సంతాపం

ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ మృతి పట్ల మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తెలంగాణ ఉద్యమంలో ఆయన రచించిన ‘జయ జయ హే తెలంగాణ’ గీతం ప్రజల్లో స్ఫూర్తి నింపిందని గుర్తుచేశారు. ఆయన మరణం తెలంగాణ సమాజానికి తీరని లోటు అని పేర్కొన్నారు. మంత్రి అందెశ్రీ కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపి, ఆయన ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థించారు.


