News March 31, 2025
రాచకొండలో రంజాన్ భద్రతా ఏర్పాట్లు

రంజాన్ పండుగ నేపథ్యంలో రాచకొండ కమిషనరేట్ పరిధిలో కట్టు దిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. మసీదుల వద్ద వాహనాల నంబర్ ప్లేట్లు, పత్రాల చెకింగ్ నిర్వహించాలని, అవసరమైన ప్రదేశాల్లో బాంబు స్క్వాడ్ ద్వారా తనిఖీలు చేపట్టాలని అధికారులకు సీపీ సుధీర్ బాబు ఆదేశాలు జారీ చేశారు. దీంతో దర్గా వంటి పలు ప్రాంతాల్లో ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా యాంటీ సబోటేజ్ చెక్ టీమ్, డాగ్ స్కాడ్ తనిఖీలు చేపట్టారు.
Similar News
News December 10, 2025
కామారెడ్డి: ఓటరు ID లేకున్నా ఓటు వేయవచ్చు: కలెక్టర్

ఓటరు ID లేకున్నా అర్హులు ఓటు వేయవచ్చని KMR కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ స్పష్టం చేశారు. ఎన్నికల సంఘం సూచించిన ఆధార్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, వివిధ ప్రభుత్వ ఐడీ కార్డులు, హెల్త్ కార్డులు సహా మొత్తం 18 రకాల గుర్తింపు కార్డుల్లో దేనినైనా చూపించి ఓటు వేయవచ్చని వెల్లడించారు. ఓటరు స్లిప్‌ను tsec.gov.in వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చని పేర్కొన్నారు. నిర్భయంగా ఓటు హక్కు వినియోగించుకోవాలని సూచించారు.
News December 10, 2025
కామారెడ్డి జిల్లాలో 20 ప్రాంతాల్లో ఆరెంజ్ అలర్ట్

కామారెడ్డి జిల్లాలో 20 ప్రాంతాల్లో ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. ఈ మేరకు వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. 20 ప్రదేశాల్లో 10°Cల లోపు అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. 11 ప్రదేశాల్లో 15°Cల లోపు కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యి. కామారెడ్డి జిల్లాలోని అన్ని మండలాల్లో శీతల గాలులు వీస్తూ అత్యల్ప ఉష్ణోగ్రతలు రికార్డవ్వడంతో ఎక్కడిక్కడ చలి మంటలు కాచుకుంటూ ప్రజలు సేద తీరుతున్నారు.
News December 10, 2025
జగిత్యాల మెడికల్ కాలేజీని సందర్శించిన ఎమ్మెల్యే

జగిత్యాల జిల్లా కేంద్రంలోని మెడికల్ కాలేజీని కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ బుధవారం సందర్శించారు. మెడికల్ కాలేజీ నిర్మాణ పనులను పరిశీలించారు. తెలంగాణలో ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ ఉండాలనే విజన్‌తోనే కేవలం 3 మెడికల్ కాలేజీలు ఉన్న రాష్ట్రాన్ని కేసీఆర్ 33 మెడికల్ కాలేజీల రాష్ట్రంగా మార్చారన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రెండేళ్లయినా మెడికల్ కాలేజీలో సదుపాయాల కల్పనలో విఫలమైందన్నారు.


