News March 31, 2025

ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎమ్మెల్యేలు

image

ఉగాది పర్వదినం సందర్భంగా జిల్లా కేంద్రంలోని భద్రకాళి అమ్మవారి ఆలయాన్నీ, షిరిడి సాయినాథుడి ఆలయంలో ఎమ్మెల్యేలు రాజేందర్ రెడ్డి, కేఆర్ నాగరాజు ప్రత్యేక పూజలను నిర్వహించారు. దేవుళ్ల అనుగ్రహంతో రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని, ప్రజలంతా కలకాలం సుఖసంతోషాలతో ఉండాలని వారు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పలువురు నేతలు ఉన్నారు.

Similar News

News November 4, 2025

సంగారెడ్డి: ఉన్నత చదువులు.. 30 మంది టీచర్లకు అనుమతి

image

సంగారెడ్డి జిల్లాలోని వివిధ ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు దూరవిద్య ద్వారా ఉన్నత చదువులు చదివేందుకు అనుమతిస్తూ జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లాలో 30 మంది ఎస్‌జీటీ ఉపాధ్యాయులు ఉన్నత చదువులకు అనుమతి కోరుతూ దరఖాస్తు చేసుకున్నారని డీఈఓ తెలిపారు. ఉపాధ్యాయులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

News November 4, 2025

VZM: ఈ నెల 6న జడ్పీ సర్వ సభ్య సమావేశం

image

జిల్లా ప్రజా పరిషత్ సాధారణ సర్వసభ్య సమావేశం ఈనెల 6న ఉదయం 11 గంటలకు జిల్లా పరిషత్ సమావేశ భవనంలో జరుగనుందని CEO సత్యనారాయణ మంగళవారం తెలిపారు. అక్టోబర్ 29న నిర్వహించాల్సిన సమావేశాన్ని తుఫాన్ కారణంగా వాయిదా వేశామన్నారు. జిల్లా పరిషత్ అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు ఆదేశాల మేరకు నవంబర్ 6న సర్వసభ్య సమావేశం నిర్వహించనున్నట్లు చెప్పారు.

News November 4, 2025

నష్టం వివరాలను త్వరగా పంపించండి: కలెక్టర్

image

తుఫాన్ నేపథ్యంలో జరిగిన నష్టం వివరాలను క్షేత్రస్థాయిలో సమగ్రంగా పరిశీలన చేసి వెంటనే నివేదికలు పంపించాలని కలెక్టర్ రాజాబాబు ఆదేశించారు. ఈ మేరకు ఒంగోలులోని కలెక్టర్ కార్యాలయం నుంచి మండల స్థాయి అధికారులతో కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో చేపట్టిన ఈ పంట ప్రక్రియను నిర్దేశించిన గడువులోగా పూర్తి చేయాలన్నారు. అలాగే దెబ్బతిన్న రహదారుల వివరాలను సైతం పంపాలన్నారు.