News March 31, 2025

సామ్ కరన్‌పై ఆకాశ్ చోప్రా విమర్శలు

image

CSK సామ్ కరన్‌ను ఆడించడంపై ఆకాశ్ చోప్రా విమర్శలు గుప్పించారు. ‘CSK జట్టును సరిగ్గా ఎంపిక చేసుకోవాలి. నిజం చెప్పాలంటే అటు బౌలింగ్, ఇటు బ్యాటింగ్.. రెండింటిలోనూ కరన్ విఫలమవుతున్నాడు. కాన్వే, రచిన్, గైక్వాడ్ తొలి 3స్థానాల్లో ఆడాలి. హుడా, త్రిపాఠీలో ఒకరినే ఆడించాలి. తర్వాత దూబే, విజయ్ శంకర్, జడ్డూ, ధోనీ ఉండాలి. ఆ లైనప్ కరన్‌ వల్ల బలహీనపడుతోంది’ అని తెలిపారు. కాగా ఇవాళ కరన్‌ను దూరంగా ఉంచారు.

Similar News

News April 3, 2025

జనాలను ఫూల్స్ చేస్తున్న చంద్రబాబు: రోజా

image

AP: ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా సీఎం చంద్రబాబు జనాలను ఫూల్స్ చేస్తున్నారని వైసీపీ నేత రోజా విమర్శించారు. సూపర్ సిక్స్ హామీలు నెరవేర్చడం చేతకాకపోతే పదవి నుంచి దిగిపోవాలని ఆమె డిమాండ్ చేశారు. ‘చంద్రబాబు ఈవీఎంలను మేనేజ్ చేస్తారు కానీ కరువును మాత్రం చేయలేకపోతున్నారు. కరువుతో చాలా జిల్లాలు అల్లాడిపోతున్నా పట్టించుకోవడం లేదు. బాబు చెప్పే మాటలకు, చేసే పనులకు అసలు సంబంధమే లేదు’ అని ఆమె ఫైర్ అయ్యారు.

News April 3, 2025

ఏప్రిల్ 3: చరిత్రలో ఈరోజు

image

1955: ప్రముఖ నేపథ్య గాయకుడు హరిహరన్ జననం
1962: నటి జయప్రద జననం
1973: నటుడు, కొరియోగ్రాఫర్ ప్రభుదేవా జననం
1964: భారత మాజీ క్రికెటర్ అజయ్ శర్మ జననం
1680: మహారాష్ట్ర సామ్రాజ్య స్థాపకుడు ఛత్రపతి శివాజీ మరణం
1973: కొరియోగ్రాఫర్, దర్శకుడు, నటుడు ప్రభుదేవా జననం
1973: భారత మాజీ క్రికెటర్ నీలేష్ కులకర్ణి జననం

News April 3, 2025

జైస్వాల్ ముంబైని వీడటానికి కారణం అదేనా?

image

యువ క్రికెటర్ జైస్వాల్ <<15967764>>ముంబైని వీడి గోవా జట్టులో<<>> చేరనున్నారని వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ముంబై టీమ్‌తో ఆయనకు ఏర్పడిన విభేదాలే దీనికి కారణమని తెలుస్తోంది. క్రికెట్ వర్గాల ప్రకారం.. ముంబై-విదర్భ మధ్య జరిగిన రంజీ ట్రోఫీ సెమీ ఫైనల్ మ్యాచ్‌కి జైస్వాల్ మోకాలి నొప్పి పేరిట దూరమయ్యారు. ఆ మ్యాచ్‌లో ముంబై ఓడింది. దాంతో అసోసియేషన్ పెద్దలకు, జైస్వాల్‌కు మధ్య వాగ్వాదం జరిగినట్లు సమాచారం.

error: Content is protected !!