News March 31, 2025
SRH ఆరోపణలపై స్పందించిన HCA

SRH, HCA ప్రతిష్ఠను మసకబార్చేందుకు కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని HCA మండిపడింది. SRH యాజమాన్యం నుంచి తమకు ఎలాంటి ఈమెయిల్స్ రాలేదని తెలిపింది. సోషల్ మీడియాలో వస్తున్న వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదని స్పష్టం చేసింది. కాగా ఉచిత పాస్‌ల కోసం HCA తమను తీవ్ర ఒత్తిడికి గురి చేస్తోందని SRH ఆరోపించినట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. టికెట్ల విషయంపై HCA అధ్యక్షుడు జగన్ బెదిరించినట్లు సమాచారం.
Similar News
News November 9, 2025
చార్మినార్ మాటున అంతులేని అరాచకాలు: బండి

TG: పాతబస్తీలో డ్రగ్స్ ముఠాలు రెచ్చిపోతున్నాయని కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘డ్రగ్స్ మత్తులో మైనర్ అమ్మాయిలను కొందరు ట్రాప్ చేస్తున్నారు. కేరళ ఫైల్స్ సినిమా లెవల్లో హైదరాబాద్ ఫైల్స్ సినిమా నడుస్తోంది. చార్మినార్ మాటున అంతులేని అరాచకాలు జరుగుతున్నాయి. బర్త్ డే కేక్స్‌లో డ్రగ్స్ పెట్టి మైనర్ గర్ల్స్‌ను బలి చేస్తున్నారు. పాతబస్తీలో అరాచకాలకు MIM అండదండలున్నాయి’ అని ఆరోపించారు.
News November 9, 2025
భారీగా పడిపోయిన ధరలు.. రైతులకు నష్టాలు!

AP: అరటి రైతులకు ఈసారి కార్తీకమాసం నష్టాల్ని తీసుకొచ్చింది. ఏటా ఈ సీజన్‌లో భారీ డిమాండ్‌తో పాటు మంచి లాభాలు వచ్చేవని అంబేడ్కర్ కోనసీమ జిల్లా రైతులు చెబుతున్నారు. కానీ ఈ ఏడాది ధరలు తగ్గి నష్టాలు మిగిలాయని వాపోతున్నారు. గత ఏడాది కర్పూర రకం అరటి గెల రూ.500 ఉండగా ఈ ఏడాది రూ.200 కూడా పలకడం లేదంటున్నారు. తుఫాను కారణంగా గెలలు పడిపోయి నాసిరకంగా మారడమూ ఓ కారణమని పేర్కొంటున్నారు.
News November 9, 2025
జూబ్లీహిల్స్ ఉపఎన్నిక పోలింగ్ వివరాలివే

✒ ఎల్లుండి పోలింగ్, బరిలో 58 మంది అభ్యర్థులు
✒ 407 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు. మొత్తం 4,01,365 మంది ఓటర్లు. పోలింగ్ విధుల్లో పాల్గొననున్న 2060 మంది సిబ్బంది
✒ 139 ప్రాంతాల్లో డ్రోన్లతో పటిష్ఠమైన నిఘా. 226 క్రిటికల్ పోలింగ్ స్టేషన్లు గుర్తింపు
✒ క్రిటికల్ పోలింగ్ స్టేషన్ల దగ్గర పారామిలిటరీ బలగాలతో బందోబస్తు
✒ GHMC ఆఫీస్‌లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు
✒ ఈ నెల 14న ఓట్ల లెక్కింపు, ఫలితం


