News March 31, 2025
నాంపల్లి: జాతీయ కమిషన్ సభ్యుడిగా శ్రీనివాస్ నియామకం

నిజాం వైద్య విజ్ఞాన సంస్థ, వైద్య అనుబంధ వృత్తి విజ్ఞాన కళాశాల ప్రిన్సిపల్ నాంపల్లి మండల కేంద్రానికి చెందిన శిరందాసు శ్రీనివాస్ కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ, వైద్య అనుబంధ వృత్తుల జాతీయ కమిషన్ సభ్యుడిగా ఎన్నికైయ్యారు. పట్టుదలతో ఏదైనా సాధించవచ్చని నిరూపించారు. ఉన్నత శిఖరాలు అధిరోహించిన శిరందాసు శ్రీనివాస్‌కి నాంపల్లి మండల ప్రజలు శుభాకాంక్షలు తెలిపారు.
Similar News
News April 6, 2025
మద్యానికి డబ్బు ఇవ్వలేదని కన్నతల్లి హత్య

మద్యానికి డబ్బులివ్వలేదని తల్లిని కడతేర్చాడు ఓ కసాయి కొడుకు. ఈ దారుణ ఘటన బీబీనగర్ మండలంలో జరిగింది. CI ప్రభాకర్ తెలిపిన వివరాలు.. గుర్రాలదండి కొత్తతండాకు చెందిన మోజి(50) రాములు దంపతుల కుమారుడు శ్రీను. భార్యతో కలిసి చేవెళ్లలో ఉంటున్నాడు. APR 4న భార్యతో గొడవపడి తల్లి దగ్గరకు వచ్చాడు. మద్యానికి తల్లి డబ్బులు ఇవ్వలేదని గొడవ పెట్టుకున్నాడు. కోపంతో మోజి తలపై కర్రతో బలంగా కొట్టి చంపేశాడు.
News April 6, 2025
NLG: రాములోరి కళ్యాణానికి సర్వం సిద్ధం

సీతారాముడి కళ్యాణోత్సవానికి జిల్లా ముస్తాబైంది. జిల్లాలోని అన్ని ఆలయాలల్లో నేడు శ్రీరామనవమి వేడుకలు నిర్వహించేందుకు నిర్వాహకులు ఏర్పాట్లు పూర్తిచేశారు. ఆలయాలను విద్యుత్ దీపాలు, పూలతో అలంకరించి చలువ పందిళ్లు వేశారు. కళ్యాణ వేడుకల అనంతరం అన్నదానం నిర్వహించనున్నారు. సాయంత్రం కళ్యాణమూర్తులను ఊరేగించనున్నారు. జిల్లా కేంద్రం రామగిరి రామాలయంలో శ్రీరామనవమి వేడుకలకు నిర్వాహకులు భారీ ఏర్పాట్లు చేశారు.
News April 6, 2025
NLG: 6,497 మందిలో.. 3,033 యువతకు ఉద్యోగాలు

నల్గొండ ఎస్పీ కార్యాలయంలో పోలీసుల ఆధ్వర్యంలో నిర్వహించిన యువ తేజం మెగా జాబ్ మేళాకు విశేష స్పందన లభించింది. ఈ జాబ్ మేళాకు 6497 మంది పైగా నిరుద్యోగ యువతీ, యువకులు హాజరు కాగా, 3033 మంది ఉద్యోగాలకు ఎంపికకాగా, వారికి ఎస్పీ శరత్ చంద్ర పవార్ నియామక పత్రాలు అందజేశారు. చదువుకున్న యువత చెడు వ్యసనాలకు లోనవకుండా ఉపాధి అవకాశాలు అందిపుచ్చుకొని ఉన్నత స్థానాలకు చేరుకోవాలని ఎస్పీ సూచించారు.