News March 31, 2025
భార్య పుట్టింటికి వెళ్లడంతో.. భర్త ఆత్మహత్య

భార్య పుట్టింటికి వెళ్లిందని మనస్థాపనతో భర్త ఆత్మహత్య చేసుకున్న ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఆదివారం చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. మణుగూరు మండలం శేషగిరి నగర్‌కు చెందిన గుంజ చిన్న రామారావు(28) తన భార్య పుట్టింటికి వెళ్లిందని మనస్థాపంతో ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఊరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడని తెలిపారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.
Similar News
News September 16, 2025
అనకాపల్లి జిల్లాలో 12,362 మెట్రిక్ టన్నుల యూరియా పంపిణీ

అనకాపల్లి జిల్లాలో ఇప్పటివరకు రైతులకు 12,362 మెట్రిక్ టన్నుల యూరియా సరఫరా చేసినట్లు జిల్లా వ్యవసాయ అధికారి మోహన్ రావు మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఇంకా 845 మెట్రిక్ టన్నుల ఏరియా అందుబాటులో ఉన్నట్లు చెప్పారు. మరో 610 మెట్రిక్ టన్నుల యూరియాను జిల్లాకు కేటాయించినట్లు పేర్కొన్నారు. రైతులు యూరియా గురించి ఆందోళన పడవద్దని సూచించారు. ఎరువుల వినియోగంలో సమతుల్యత పాటించాలన్నారు.
News September 16, 2025
OG రిలీజ్.. పేపర్లతో థియేటర్ నిండిపోతుంది!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా అంటే థియేటర్ల వద్ద రచ్చ మామూలుగా ఉండదు. అలాంటిది భారీ అంచనాల మధ్య రిలీజయ్యే ‘OG’కి ఇంకెంత క్రేజ్ ఉండాలి. ఈనెల 25న ఫ్యాన్స్ షోలో థియేటర్లను పేపర్లతో నింపేందుకు అభిమానులు సిద్ధం చేసుకుంటున్నారు. తాజాగా మల్కాజిగిరిలోని సాయి రామ్ థియేటర్‌లో స్పెషల్ షో కోసం ఏర్పాటు చేసిన పేపర్స్ చూసి ఇతర అభిమానులు సైతం ఆశ్చర్యపోతున్నారు. వందల కేజీల న్యూస్ పేపర్లను కట్ చేయడం విశేషం.
News September 16, 2025
ఉప్పల్ అభయాంజనేయ స్వామి ఆలయ ప్రహరీని ఢీకొట్టిన లారీ

ఉప్పల్ NGRI సమీపంలోని శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయ ప్రహరీని ఢీకొని సెప్టిక్ ట్యాంకర్ బోల్తా పడింది. డ్రైవర్ కుమార్ నాయక్‌కు తీవ్ర గాయాలయ్యాయి. అతడిని గాంధీ ఆసుపత్రికి తరలించారు. నిద్రమత్తులో ప్రమాదం జరిగిందని పోలీసులు భావిస్తున్నారు. పోలీసులు ట్యాంకర్‌ను తొలగించి రోడ్డు ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు.