News March 26, 2024

కవిత పిటిషన్‌పై నేడు విచారణ

image

లిక్కర్ స్కామ్‌లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను దాఖలు చేసిన బెయిల్‌ పిటిషన్‌పై ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు ఈరోజు విచారణ జరపనుంది. కవితకు కోర్టు విధించిన కస్టడీ సైతం నేటితో ముగియనుంది. ఈ నేపథ్యంలో ప్రత్యేక సీబీఐ కోర్టులో ఆమెను ఈడీ హాజరుపరచనుంది. కస్టడీని మరో 4రోజులపాటు పొడిగించాలని ఈడీ కోరే అవకాశం ఉంది.

Similar News

News March 13, 2026

ఆ పథకంతో 17 వేల మందికి ఉపాధి: మంత్రి

image

AP: ‘సీఎం ఉపాధి సృష్టి’ పథకం ద్వారా ₹300Crతో 3,500 సూక్ష్మ పరిశ్రమలకు ఆర్థికసాయం చేయాలని క్యాబినెట్ నిర్ణయించినట్లు మంత్రి పార్థసారథి తెలిపారు. దీని ద్వారా 17 వేల మందికి ఉపాధి లభించనుందన్నారు. ఇక APSP బెటాలియన్లలో 300 హెడ్ కానిస్టేబుల్స్ పోస్టుల్ని అసిస్టెంట్ రిజర్వ్ సబ్ ఇన్‌స్పెక్టర్ పోస్టులుగా అప్‌గ్రేడ్ చేసేందుకు, నీరుకొండలో తెలుగు కల్చరల్ సెంటర్‌కు ₹119.27Cr మంజూరుకు ప్రతిపాదించామన్నారు.

News March 13, 2026

పెళ్లి తర్వాత రష్మిక ఫస్ట్ సినిమా.. రిలీజ్ డేట్ ఇదే

image

విజయ్ దేవరకొండతో పెళ్లి వేడుకలు ముగియడంతో రష్మిక మళ్లీ కెరీర్‌పై ఫోకస్ పెట్టారు. తాను నటించిన బాలీవుడ్ చిత్రం ‘కాక్‌టైల్-2’ జూన్ 19న విడుదల కానున్నట్లు ఆమె ట్వీట్ చేశారు. రష్మిక పెళ్లి తర్వాత విడుదల కానున్న తొలి మూవీ ఇదే కావడం విశేషం. ఈ నెల 18న థియేటర్లలో ఫస్ట్ లుక్ రిలీజ్ చేయనున్నట్లు ఆమె తెలిపారు. ఈ సినిమాలో షాహిద్ కపూర్, కృతి సనన్ నటిస్తున్నారు. 2012లో హిట్ అయిన ‘కాక్‌టైల్’కు ఇది సీక్వెల్.

News March 13, 2026

IPL SPECIAL: 2 నెలలు పండగే!

image

ఈనెల 28 నుంచి ఐపీఎల్ సందడి మొదలుకానుంది. ఈసారి రికార్డు స్థాయిలో 84 మ్యాచ్‌లు జరగనుండటంతో అభిమానులకు 2 నెలల పాటు వినోదం గ్యారంటీ. లీగ్ చరిత్రలోనే ఇది అత్యంత సుదీర్ఘమైన సీజన్ కానుంది. అలాగే ఆటను మరింత రంజుగా మార్చే ‘ఇంపాక్ట్ ప్లేయర్’ రూల్ 2027 వరకు కొనసాగుతుందని బీసీసీఐ ఇప్పటికే స్పష్టం చేసింది. ఇవి క్రికెట్ అభిమానులకు మరింత ఆసక్తికర మ్యాచ్‌లను అందించనున్నాయి.