News March 31, 2025
మాసాయిపేట: విద్యుత్ షాక్‌తో మృతి

మాసాయిపేట మండలంలో విద్యుత్ షాక్ తగిలి ఒకరు మృతి చెందినట్లు ఎస్ఐ చైతన్యకుమార్ రెడ్డి తెలిపారు. మాసాయిపేటకు చెందిన గౌరవగల్లు నరసింహులు (42) స్నానం చేసేందుకు బాత్రూంలోకి వెళ్లి జారిపడ్డాడు. అదే సమయంలో వాటర్ హీటరు పెట్టిన బకెట్లో చేయ్యిపడి విద్యుత్ షాక్ తగిలింది. విద్యుదాఘాతం ఏర్పడి నరసింహులు అక్కడికక్కడే మృతి చెందినట్లు భార్య సంతోషి పోలీసులకు ఫిర్యాదు చేసింది.
Similar News
News April 3, 2025
MDK: శిలాఫలకంపై పదవీకాలం ముగిసిన MLCల పేర్లు.. తీవ్ర విమర్శలు

పదవీకాలం ముగిసినా ఎమ్మెల్సీల పేరుతో అభివృద్ధి శిలాఫలకాలు ప్రారంభించడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. రామాయంపేట మున్సిపాలిటీ పరిధిలో బుధవారం ఎమ్మెల్యే రోహిత్ రావు రూ.14 కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. అభివృద్ధి శిలాఫలకంపై అధికారులు నిర్లక్ష్యంగా పదవీకాలం ముగిసిన ఎమ్మెల్సీ రగోతం రెడ్డి, శేరి సుభాష్ రెడ్డి, జీవన్ రెడ్డి పేర్లు పెట్టడంపై స్థానిక నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
News April 3, 2025
మెదక్ జిల్లాలో ముగిసిన టెన్త్ పరీక్షలు

మెదక్ జిల్లాలో పదవ తరగతి పరీక్షలు బుధవారం ప్రశాంతంగా ముగిశాయి. చివరి రోజు సాంఘిక శాస్త్రం పరీక్ష జరిగింది. రెగ్యులర్, ప్రైవేట్ విద్యార్థులు 10,408 మంది విద్యార్థులు హాజరు కావాల్సి ఉండగా 10,382 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరైనట్లు జిల్లా విద్యాశాఖ అధికారి ప్రొఫెసర్ రాధాకృష్ణ తెలిపారు. 26 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారని పేర్కొన్నారు. పరీక్షలు ముగియడంతో విద్యార్థులు సంతోషంగా ఇళ్లకు వెళ్లారు.
News April 3, 2025
వేసవి సెలవులు.. మీ పిల్లలు జాగ్రత్త: మెదక్ ఎస్పీ

మైనర్లకు సరదా కోసం బైకులు ఇస్తే మీ జీవితంలో కొత్త సమస్యలు కొని తెచ్చుకున్నట్లేనని మెదక్ ఎస్పీ డి.ఉదయ్ కుమార్ రెడ్డి హెచ్చరించారు. పిల్లల ఈత సరదా తల్లిదండ్రులకు తీరని దుఃఖాన్ని మిగిలించవద్దని అన్నారు. వేసవి సెలవులు వస్తున్నాయని, మీ పిల్లలు బావులు, చెరువుల, వాగుల్లో ఈతకు వెళ్లే క్రమంలో తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండాలన్నారు. లేదంటే ఈత సరదా ప్రమాదంగా మారే అవకాశం ఉందని హెచ్చరించారు.