News March 31, 2025

కుల్కచర్ల: గ్రూప్-1 అధికారిగా మోనికా రాణి

image

కుల్కచర్ల మండల కేంద్రానికి చెందిన మోనికా రాణి ఈరోజు TSPSC విడుదలైన గ్రూప్-1 జనరల్ ర్యాంకింగ్ లిస్టులో రాష్ట్రస్థాయిలో 263వ ర్యాంక్, ఎస్సీ కేటగిరిలో 16వ ర్యాంకు సాధించి గ్రూప్-1 అధికారిగా ఎంపికైంది. ప్రస్తుతం ఇంటర్మీడియట్ బోర్డు కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్‌గా విధులు నిర్వహిస్తుంది.రాష్ట్ర వ్యాప్తంగా 563 గ్రూప్-1 పొస్టులు ఉండగా మల్టి జోన్లో ఎస్సీ కేటగిరి విభాగంలో 48 పోస్టులు ఉన్నాయి.

Similar News

News February 23, 2026

విశాఖ: 63వ సారి రక్తదానం చేసి.. మానవతను చాటారు

image

విశాఖ స్టీల్ ప్లాంట్ జనరల్ ఫోర్‌మాన్ కె.వి.ఎల్‌.ఎన్‌.రెడ్డి 63వసారి రక్తదానం చేసి మానవతను చాటారు. రక్త క్యాన్సర్‌తో బాధపడుతున్న 9 ఏళ్ల రమ్యత అచ్యుతకు అత్యవసరంగా అవసరమైన సింగిల్ డోనర్ ప్లేట్లెట్స్(SDP)ను అగనంపూడి హోమి బాబా ఆసుపత్రిలో దానం చేశారు. ప్లేట్లెట్ కౌంట్ 10 వేలకు పడిపోవడంతో వెంటనే స్పందించారు. B+ గ్రూప్‌నకు చెందిన రెడ్డి రెండోసారి SDP దానం చేయడంతో సహోద్యోగులు అభినందించారు.

News February 23, 2026

TGPSC వన్ టైమ్ రిజిస్ట్రేషన్ గడువు పెంపు

image

TG: రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాలకు సన్నద్ధమయ్యే అభ్యర్థులు వన్ టైమ్ రిజిస్ట్రేషన్ (ఓటీఆర్) అప్‌డేట్ చేసుకునే గడువును మార్చి 25కు పొడిగిస్తున్నట్లు TGPSC ప్రకటించింది. ఇదే చివరి అవకాశమని స్పష్టం చేసింది. అభ్యర్థులు దరఖాస్తు ఫారమ్‌లో నింపే సమాచారానికి ఓటీఆర్ డేటానే ప్రాథమిక ఆధారం అవుతుందని తెలిపింది. అధికారిక వెబ్‌సైట్ <>https://www.tgpsc.gov.in<<>> ద్వారా తమ వివరాలను అప్‌డేట్ చేసుకోవాలని సూచించింది.

News February 23, 2026

SKLM: డయేరియా గ్రామాల్లో పర్యటించిన కలెక్టర్

image

శ్రీకాకుళం నగర పరిధిలో ప్రబలిన ధైర్య ప్రాంతాల్లో జిల్లా కలెక్టర్ దినకర్ పుండ్కర్ సోమవారం పర్యటించారు. కాకివీధి, గుడివీధి, దమ్మలవీధి, మంగువారి తోట గ్రామాల్లో డయేరియా ప్రబలి పలువురు అస్వస్థకు గురయ్యారు. నీరు కాచి చల్లార్చి తాగాలని, నిల్వ ఉన్న ఆహార పదార్థాలు తినరాదని సూచనలు చేశారు. ఆయా గ్రామాలకు ట్యాంకర్ల ద్వారా నీరు సరఫరా చేస్తామని 2,3 రోజులు ఇంట్లో నిలువ ఉన్న నీరు వాడకూడదన్నారు.