News March 31, 2025

నేటితో ముగియనున్న గడువు

image

AP: ఆస్తి పన్ను బకాయిలపై ప్రభుత్వం ప్రకటించిన వడ్డీ రాయితీ గడువు నేటితో ముగియనుంది. ఈ నెల 25న 50% రాయితీ ప్రకటించగా శనివారం ఒక్క రోజే రూ.60 కోట్లు, మొత్తంగా రూ.204 కోట్లు వసూలయ్యాయి. రంజాన్ కారణంగా ఇవాళ సెలవు అయినా పన్ను వసూళ్లకు వీలుగా ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. ఉ.9 నుంచి రా.9 వరకు అధికారులు అందుబాటులో ఉంటారు. నిన్న ఉగాది సందర్భంగా ఎక్కువ మంది పన్ను చెల్లింపులు చేయలేదు.

Similar News

News January 16, 2026

రేపు కాకినాడ.. ఎల్లుండి అమరావతిలో సీఎం పర్యటన

image

AP: సీఎం చంద్రబాబు రేపు కాకినాడలో పర్యటించి అమ్మోనియం ప్లాంట్‌ను ప్రారంభించనున్నారు. అనంతరం బహిరంగ సభలో పాల్గొంటారు. ఎల్లుండి ఆయన అమరావతిలో అన్న క్యాంటీన్‌ను ప్రారంభిస్తారు. ఈ నెల 19న సీఎం దావోస్ పర్యటనకు వెళ్తారు. రాష్ట్రంలో భారీ పెట్టుబడులే లక్ష్యంగా ఈ టూర్ ఉండనుందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. సంక్రాంతి పండుగ నేపథ్యంలో ప్రస్తుతం సీఎం స్వగ్రామం నారావారిపల్లెలో ఉన్న విషయం తెలిసిందే.

News January 16, 2026

మరియా గొప్ప మహిళ: ట్రంప్

image

వెనిజులా ప్రతిపక్ష నేత మరియా మచాడో తన నోబెల్ శాంతి బహుమతిని ట్రంప్‌కు అందజేసిన నేపథ్యంలో ఆయన స్పందించారు. మరియాతో భేటీ కావడం గౌరవంగా భావిస్తున్నట్లు చెప్పారు. చాలా కష్టాలను ఎదుర్కొన్న ఆమె గొప్ప మహిళ అని కొనియాడారు. తాను చేసిన కృషిని గౌరవిస్తూ నోబెల్ శాంతి బహుమతి అందజేసినట్లు పేర్కొన్నారు. పరస్పర గౌరవానికి ఇదో గొప్ప సూచిక అని చెప్పారు. ఈ సంద్భంగా ఆమెకు ధన్యవాదాలు తెలిపారు.

News January 16, 2026

క్షణాల్లో మెరిసే అందం మీ సొంతం

image

ఏదైనా ఫంక్షన్లు, పెళ్లిల్లు, పార్టీలు ఉంటే అందంగా కనిపించడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. ఈ హోం మేడ్ ఫేస్ ప్యాక్స్ వాడితే ఇన్‌స్టంట్ గ్లో వస్తుందంటున్నారు నిపుణులు. * బాగా పండిన అరటిపండు, తేనె, శనగపిండి, కాఫీ పౌడర్ కలిపి చర్మానికి అప్లై చేసి, 10నిమిషాల తర్వాత శుభ్రం చేసుకోవాలి. -ఓట్స్‌ గంటపాటు నానబెట్టి తేనె కలిపి పేస్ట్ చేసి దాన్ని చర్మానికి అప్లై చేసి పావుగంట తర్వాత శుభ్రం చేసుకోవాలి.