News March 31, 2025
మానసిక దివ్యాంగురాలిపై అత్యాచారం

మానసిక దివ్యాంగురాలిపై ఓ వ్యక్తి అత్యాచారానికి పాల్పడిన ఘటన అశ్వారావుపేట మండలంలో జరిగింది. ఎస్ఐ యయాతి రాజు వివరాలు.. ఆసుపాకకు చెందిన దివ్యాంగురాలు తన తల్లితో పాటు కలిసి ఉంటుంది. శనివారం తల్లి బయటకు వెళ్లడంతో ఒంటరిగా ఉన్న దివ్యాంగురాలిపై అదే గ్రామానికి చెందిన వెంకటేశ్ అమెపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఆమె కేకలు వేయడంతో చుట్టు పక్కలవారు రావడంతో వెంకటేశ్ పరారయ్యాడు. కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు.
Similar News
News April 3, 2025
ముస్లింలను అణచివేసేందుకే వక్ఫ్ బిల్లు: రాహుల్

దేశంలోని ముస్లింలను అణచివేసి, వారి ఆస్తి హక్కులను హరించేందుకు వక్ఫ్ బిల్లును ఓ ఆయుధంగా వాడుకుంటున్నారని ఏఐసీసీ అగ్ర నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. ‘ముస్లింలను లక్ష్యంగా చేసుకునే వక్ఫ్ బిల్లు తీసుకొచ్చారు. భవిష్యత్‌లో దీనిని ఇతర వర్గాలపై కూడా ప్రయోగించవచ్చు. ఈ బిల్లు ఆర్టికల్ 25ను ఉల్లంఘిస్తుంది. ఇది దేశ ఆలోచనలపై దాడి చేస్తుంది’ అని ఆయన ఎక్స్‌లో తీవ్ర విమర్శలు చేశారు.
News April 3, 2025
కొండాపూర్ ఆర్ఐ సస్పెండ్.. తహశీల్దార్ బదిలీ

వారసత్వ ధ్రువీకరణ పత్రం మంజూరులో అవకతవలకు పాల్పడిన కొండాపూర్ ఆర్ఐ మహదేవుని సస్పెండ్ చేస్తూ కలెక్టర్ బుధవారం ఉత్తరుడు జారీ చేశారు. తహశీల్దార్ అనితను నారాయణఖేడ్ ఆర్టీవో కార్యాలయం బదిలీ చేశారు. ఆర్ఐ తప్పుడు నివేదిక ఆధారంగా వారసత్వ బదిలీ సర్టిఫికెట్ ఇచ్చారని కలెక్టర్‌కు బాధితులు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు ఆధారంగా విచారణ చేయించిన కలెక్టర్ వాస్తవమని తేలడంతో సదరు అధికారులపై చర్యలు తీసుకున్నారు.
News April 3, 2025
MDK: శిలాఫలకంపై పదవీకాలం ముగిసిన MLCల పేర్లు.. తీవ్ర విమర్శలు

పదవీకాలం ముగిసినా ఎమ్మెల్సీల పేరుతో అభివృద్ధి శిలాఫలకాలు ప్రారంభించడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. రామాయంపేట మున్సిపాలిటీ పరిధిలో బుధవారం ఎమ్మెల్యే రోహిత్ రావు రూ.14 కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. అభివృద్ధి శిలాఫలకంపై అధికారులు నిర్లక్ష్యంగా పదవీకాలం ముగిసిన ఎమ్మెల్సీ రగోతం రెడ్డి, శేరి సుభాష్ రెడ్డి, జీవన్ రెడ్డి పేర్లు పెట్టడంపై స్థానిక నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.