News March 26, 2024
అడుగంటిన జలాలు.. ఎండుతున్న పంటలు!

TS: భూగర్భజలాలు అడుగంటిపోవడంతో రైతన్నలు గగ్గోలు పెడుతున్నారు. రెండు మూడు బోర్లు వేయిస్తున్నా ఫలితం ఉండట్లేదని, తడి లేక పంట ఎండిపోతోందని వాపోతున్నారు. అనేక ప్రాంతాల్లో 500 అడుగుల మేర తవ్వినా నీటి జాడ లభించకపోవడం గమనార్హం. దీంతో ఆరుతడులతో ఎలాగో నెట్టుకొస్తున్నామని రైతన్నలు చెబుతున్నారు. ఎండల తీవ్రతతో మున్ముందు పరిస్థితి మరింత దిగజారే ప్రమాదముందన్న ఆందోళనలూ వ్యక్తమవుతున్నాయి.
Similar News
News March 14, 2026
చెరకు రసంతో కాంతివంతమైన చర్మం

చర్మకాంతిని పెంచడంలో చెరకురసం ఎంతగానో సహాయపడుతుందని నిపుణులు చెబుతున్నారు. * చెరకు రసంలో కొద్దిగా ముల్తానీ మట్టి కలిపి పేస్ట్‌లా చేసుకుని ముఖానికి పట్టించి, పావుగంట తర్వాత కడిగేస్తే నల్లమచ్చలు తొలగిపోతాయి. * చెరకు రసంలో కొద్దిగా తేనె కలిపి, ముఖానికి మసాజ్ చేసి, 10నిమిషాల తర్వాత కడిగేస్తే చర్మం మృదువుగా మారుతుంది. * కాఫీపొడికి కాస్త చెరకురసాన్ని చేర్చి స్క్రబ్‌లా ఉపయోగిస్తే చర్మం కాంతులీనుతుంది.
News March 14, 2026
తిరుమలలో నిత్యం కల్యాణమే..

తిరుమల శ్రీవారికి నిత్య కల్యాణం జరుగుతుంది. శ్రీదేవి, భూదేవి సమేత మలయప్ప స్వామికి అర్చకులు రోజూ అత్యంత వైభవంగా వివాహం జరుపుతారు. భక్తుల దాంపత్య సౌఖ్యం కోసం ఈ సేవ నిర్వహిస్తారు. వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ శాస్త్రోక్తంగా ఈ క్రతువు జరుపుతారు. ఈ కళ్యాణమహోత్సవం చూడడానికి భక్తులకు కన్నుల పండువగా ఉంటుంది. ఈ సేవలో పాల్గొన్న గృహస్థులకు స్వామివారి ఆశీస్సులతో పాటు వస్త్ర బహుమానం, ప్రసాదం లభిస్తాయి.
News March 14, 2026
పాలు పితికేటప్పుడు ఈ తప్పు చేయొద్దు

కొందరు పాడి రైతులు పశువు నుంచి పాలను సేకరించేటప్పుడు పొదుగు నుంచి పూర్తిగా పాలను తీయకుండా కొన్నింటిని వదిలేస్తారు. ఇలా పొదుగులో మిగిలిపోయిన పాలలోకి బాక్టీరియా చేరి పొదుగువాపు వ్యాధికి కారణమవుతుందని వెటర్నరీ నిపుణులు చెబుతున్నారు. అలాగే పొదుగుకు అయ్యే చిన్న గాయాలకు చికిత్స అందించకుండా నిర్లక్ష్యం చేస్తే, ఇన్ఫెక్షన్ నెమ్మదిగా పొదుగులోకి వ్యాపించి పొదుగువాపు వ్యాధి వచ్చే అవకాశం ఉంది.


