News March 31, 2025
గ్రూప్-1 మెయిన్స్ టాపర్ ఈమెనే

TG: గ్రూప్-1 మెయిన్స్ ఫలితాల్లో హైదరాబాద్‌కు చెందిన కొమ్మిరెడ్డి లక్ష్మీ దీపిక టాపర్‌గా నిలిచారు. మొత్తం 900 మార్కులకు గానూ 550 మార్కులు సాధించి ఫస్ట్ ర్యాంక్ కైవసం చేసుకున్నారు. ఉస్మానియా మెడికల్ కాలేజీలో ఆమె MBBS పూర్తి చేశారు. ఎలాంటి కోచింగ్ తీసుకోకుండానే సివిల్స్‌కు సిద్ధమయ్యారు. నాలుగేళ్లపాటు యూపీఎస్సీ, గ్రూప్-1 కోసం సన్నద్ధమయ్యారు. దీపిక తండ్రి కృష్ణ ఏజీ ఆఫీస్‌లో సీనియర్ ఆఫీసర్.
Similar News
News January 20, 2026
భక్తులకు TTD గుడ్ న్యూస్.. ఇక రెండుపూటలా అన్నప్రసాదం!

AP: CM చంద్రబాబు ఆదేశాల మేరకు మార్చి నెలాఖరు నుంచి TTD పరిధిలోని అన్ని ఆలయాల్లో భక్తులకు రెండుపూటలా అన్నప్రసాదం అందించనున్నట్లు EO అనిల్‌కుమార్ సింఘాల్ తెలిపారు. మొత్తం 56 ఆలయాల్లో ఈ సౌకర్యం అందుబాటులోకి రానుంది. వీటితో పాటు ఖాళీగా ఉన్న AE పోస్టుల భర్తీకి ఏప్రిల్‌లో ఎగ్జామ్స్ నిర్వహించాలని, కొత్తగా ఎంపికైన వేద పారాయణదారులకు నియామక పత్రాలు ఇవ్వాలని అధికారులను ఆదేశించారు.
News January 20, 2026
దావోస్‌లో నారా లోకేశ్ న్యూ లుక్

పెట్టుబడులే లక్ష్యంగా AP CM చంద్రబాబు బృందం దావోస్‌లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. మంత్రి లోకేశ్ కూడా ఈ బృందంలో సభ్యుడిగా ఉన్నారు. ఈ పర్యటనలో ఆయన కూడా పెట్టుబడిదారులతో విస్తృతంగా సమావేశమవుతున్నారు. APలో పెట్టుబడులు పెట్టాలని ఇన్వెస్టర్స్‌ని ఆహ్వానిస్తున్నారు. అయితే ఆయన ఈసారి కొత్తగా టీ షర్ట్‌లో కనిపించారు. దీంతో న్యూలుక్ ఫొటోలు SMలో వైరలవుతున్నాయి. పైగా ఆయన కాస్త స్లిమ్‌గా కూడా కనిపిస్తున్నారు.
News January 20, 2026
ఈ పథకం కింద ఏ పరికరాలను అందిస్తారు?

వ్యవసాయంలో కూలీల కొరతను అధిగమించి, యాంత్రీకరణను ప్రోత్సహించి అధిక దిగుబడులను సాధించడమే వ్యవసాయ యాంత్రీకరణ పథకం ముఖ్య ఉద్దేశం. అందుకే రైతులు సాగులో ఎక్కువగా వినియోగించే ట్రాక్టర్లు, వరి కోత యంత్రాలు, పవర్ టిల్లర్లు, గడ్డి కట్టలు కట్టే యంత్రాలు, రోటావేటర్లు, బ్యాటరీ స్ప్రేయర్లను ప్రభుత్వం రాయితీగా అందించనుంది. దీని వల్ల పంట నాట్లు, కోత సమయంలో కూలీల కొరత, ఖర్చు తగ్గి రైతులకు ఎంతో లబ్ధి కలగనుంది.


