News March 31, 2025
సైదాపురం ఎంపీడీవోకు తప్పిన ప్రాణాపాయం

మనుబోలు జాతీయ రహదారిపై ఆదివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో సైదాపురం ఎంపీడీవో పురుషోత్తం శివ కుమార్‌కు ప్రాణాపాయం తప్పింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. గూడూరు ప్రయాణిస్తున్న కారును నెల్లూరు వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సు వేగంగా ఢీకొంది. ఈ ప్రమాదంలో ఎంపీడీవోకు స్వల్ప గాయాలు కాగా సమాచారం అందుకున్న మనుబోలు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Similar News
News April 4, 2025
NGKL: ఉరేసుకుని యువకుడి ఆత్మహత్య

ఓ యువకుడు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘనట నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలోని హౌసింగ్ బోర్డ్ బీసీ కాలనీలోని జరిగింది. మండలానికి చెందిన సాయికుమార్ (20) శుక్రవారం ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఆత్మహత్యకు సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది.
News April 4, 2025
అకాల వర్షాలు.. రైతులకు కడగండ్లు

తెలుగు రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో అకాల వర్షాలు రైతులకు కడగండ్లు మిగిల్చాయి. కోత దశలో ఉన్న వరి, జొన్న, మొక్కజొన్న, ఇతర పంటలు నాశనమయ్యాయి. కల్లాలు, మార్కెట్ యార్డుల్లో ఉన్న మిర్చి తడిసి ముద్దయ్యింది. ఇప్పటికే ధర లేక అల్లాడుతున్న అన్నదాతలకు ఇది పెద్ద దెబ్బే. కూరగాయలతోపాటు మామిడి, అరటి తదితర ఉద్యానవన పంటలు నేలకూలాయి. ప్రభుత్వాలే తమను ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.
News April 4, 2025
‘స్క్విడ్ గేమ్’ నటుడికి జైలుశిక్ష

నెట్‌ఫ్లిక్స్ వెబ్ సిరీస్ ‘స్క్విడ్ గేమ్’తో పాపులరైన సౌత్ కొరియన్ నటుడు ఓ యోంగ్ సు(80)కు కోర్టు ఏడాది పాటు జైలుశిక్ష విధించింది. ఓ జూనియర్ ఆర్టిస్టును అతడు లైంగికంగా వేధించడమే ఇందుకు కారణం. అయితే ఇందులో తన తప్పు లేదని యోంగ్ సు కోర్టులో చెప్పారు. కానీ ఇరుపక్షాల వాదనలు విని, సాక్ష్యాధారాలు పరిశీలించిన అనంతరం కోర్టు ఆయనకు జైలు శిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది. 50 ఏళ్లుగా ఆయన సినీ పరిశ్రమలో ఉన్నారు.