News March 31, 2025

కరీంనగర్: కొత్త సంవత్సరం.. స్థానిక సమరం!

image

స్థానిక సంస్థల ఎన్నికల ఆశావహులకు శ్రీ విశ్వావసు నామ సంవత్సరం రాజకీయ భవిష్యత్‌ను తేల్చనుంది. కరీంనగర్ జిల్లాలో త్వరలో సర్పంచ్, వార్డ్ మెంబర్, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు ఈ నూతన సంవత్సరంలో జరగనున్నాయి. వీటితో పాటు ఈ ఏడాది కరీంనగర్, జమ్మికుంట, చొప్పదండి, హుజురాబాద్ మున్సిపాలిటీ ఎన్నికలు కూడా ఉన్నాయి. దీంతో ఈ ఎన్నికల్లో పోటీకి సిద్ధమైన రాజకీయ ఆశావహులకు ఈ ఏడాది ‘కీ రోల్’ కాబోతోంది.

Similar News

News April 2, 2025

జమ్మికుంట: భారీగా పెరిగిన పత్తి ధర

image

సుదీర్ఘ సెలవుల అనంతరం జమ్మికుంట వ్యవసాయ మార్కెట్‌ ప్రారంభం కాగా.. పత్తి ధర భారీగా పెరిగింది. బుధవారం మార్కెట్‌కు 9 వాహనాల్లో రైతులు 109 క్వింటాల విడిపత్తి విక్రయానికి తీసుకురాగా..గరిష్ఠంగా రూ.7,380, కనిష్ఠంగా రూ.7,250 పలికింది. గోనెసంచుల్లో 13 క్వింటాళ్లు రాగా ₹5,300 నుంచి ₹5,500 వరకు వ్యాపారులు కొనుగోలు చేశారు. గతవారం కంటే తాజాగా పత్తిధర ₹150 పెరిగింది. ధరలు మరింత పెరగాలని రైతులు కోరుకుంటున్నారు.

News April 2, 2025

కరీంనగర్: కలెక్టరేట్లో సర్వాయి పాపన్న గౌడ్ వర్ధంతి

image

కరీంనగర్ కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్‌లో బుధవారం సర్వాయి పాపన్న గౌడ్ వర్ధంతిని నిర్వహించారు. ఈ సందర్భంగా పాపన్న గౌడ్ చిత్రపటానికి జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి, అదనపు కలెక్టర్ ప్రఫుల్ దేశాయి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో గౌడ సంఘం నాయకులు, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.

News April 2, 2025

పెద్దపల్లి: వివాహం కావడం లేదని వ్యక్తి ఆత్మహత్య

image

సుల్తానాబాద్ మండలం పూసాలలో ఓ వ్యక్తి సూసైడ్ చేసుకున్నాడు. ఎస్‌ఐ శ్రావణ్ ప్రకారం.. నల్ల లింగమూర్తి(39) PDPLలో ఓ ఫైనాన్స్ కంపెనీలో పనిచేస్తున్నాడు. వివాహం కావడం లేదనే మనస్తాపంతో ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఎలుకల మందు తాగడంతో కుటుంబసభ్యులు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మంగళవారం రాత్రి మృతిచెందాడు. సోదరుడు రాజేశం ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.

error: Content is protected !!