News March 31, 2025
జగిత్యాల: కొత్త సంవత్సరం.. స్థానిక సమరం!

స్థానిక సంస్థల ఎన్నికల ఆశావహులకు శ్రీ విశ్వావసు నామ సంవత్సరం రాజకీయ భవిష్యత్‌ను తేల్చనుంది. జగిత్యాల జిల్లాలో త్వరలో సర్పంచ్, వార్డ్ మెంబర్, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు ఈ నూతన సంవత్సరంలో జరగనున్నాయి. వీటితో పాటు ఈ ఏడాది జగిత్యాల, మెట్‌పల్లి, కోరుట్ల, రాయికల్, ధర్మపురి మున్సిపాలిటీ ఎన్నికలు కూడా ఉన్నాయి. దీంతో ఈ ఎన్నికల్లో పోటీకి సిద్ధమైన రాజకీయ ఆశావహులకు ఈ ఏడాది ‘కీ రోల్’ కాబోతోంది.
Similar News
News April 6, 2025
ఒంటిమిట్ట శ్రీ రాములవారి కళ్యాణానికి తలంబ్రాల తయారీ ప్రారంభం

ఒంటిమిట్ట శ్రీరామనవమి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఏప్రిల్ 11న జరుగనున్న శ్రీ సీతారాముల కళ్యాణం కోసం ఆలయంలో ఆదివారం తలంబ్రాల తయారీ శాస్త్రోక్తంగా ప్రారంభమైంది. సీతారాముల కళ్యాణోత్సవంలో ఎంతో ప్రాముఖ్యత ఉన్న ముత్యాల తలంబ్రాల ప్యాకింగ్ కార్యక్రమం శ్రీవారి సేవకులతో టీటీడీ ప్రారంభించింది.
News April 6, 2025
ధోనీ రిటైర్మెంట్‌పై మాజీ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు

CSK స్టార్ ప్లేయర్ ఎంఎస్ ధోనీ 2023 ఐపీఎల్ సీజన్ తర్వాత రిటైర్మెంట్ ప్రకటించాల్సిందని మాజీ క్రికెటర్ మనోజ్ తివారీ అన్నారు. ఆ సమయంలో ప్రకటన చేసి ఉంటే ఘనంగా వీడ్కోలు దక్కేదని అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం కీపింగ్ అదరగొడుతున్నా ఆయన బ్యాటింగ్ తీరుపై చెన్నై అభిమానులే అసహనం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. కాగా నిన్నటి మ్యాచుతోనే ధోనీ వీడ్కోలు పలుకుతారని ప్రచారం జరిగినా కోచ్ ఫ్లెమింగ్ అలాంటి లేదన్నారు.
News April 6, 2025
తాడేపల్లి: 8వ అంతస్తు నుంచి పడి వ్యక్తి మృతి

తాడేపల్లిలో ఆదివారం విషాద ఘటన చోటుచేసుకుంది. ఓ అపార్ట్‌మెంట్ 8వ అంతస్తు నుంచి ఒక వ్యక్తి కింద పడి అనుమానాస్పదంగా మృతిచెందాడు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. మృతుడు సదా శివరావుగా గుర్తించారు. ఘనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.