News March 31, 2025

గద్వాల: రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి

image

జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి దుర్మరణం చెందిన ఘటన ఎర్రవల్లి సమీపంలో జరిగింది. పోలీసుల వివరాలు.. గద్వాల మం. గుంటిపల్లికి చెందిన రాజన్న(60) శనివారం రాత్రి బైక్‌పై వెళ్తుండగా గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో రాజన్న అక్కడికక్కడే మృతిచెందారు. ఈ మేరకు కేసునమోదైంది.

Similar News

News October 30, 2025

ఏడాది తర్వాత పిల్లలకు ఏం పెట్టాలంటే?

image

పిల్లల ఎదుగుదలలో ఆహారం ముఖ్య పాత్ర వహిస్తుంది. కానీ చాలామంది పేరెంట్స్ ఏడాది దాటాక కూడా పిల్లలకు పెరుగన్నం, నెయ్యి, ఉప్పు కలిపి అన్నం పెడుతుంటారు. బాల్యంలో పిల్లలకు సరైన పోషకాలు అందిస్తేనే పెద్దయ్యాక కూడా ఆరోగ్యంగా ఉంటారంటున్నారు నిపుణులు. వారికి ఏడాది దాటాక నెమ్మదిగా అన్నిరకాల ఆహారాలు అలవాటు చెయ్యాలి. కిచిడీ, పొంగల్‌, పాలకూర పప్పు, వెజిటబుల్‌ రైస్‌ వంటివి తినిపించాలంటున్నారు.

News October 30, 2025

తిరుమలలో పుష్పార్చన గురించి తెలుసా..!

image

పవిత్రమైన కార్తీక మాసం శ్రావణ నక్షత్రాన్ని పురస్కరించుకుని తిరుమల శ్రీవారి ఆలయంలో పుష్పయాగం వైభవంగా నిర్వహిస్తారు. వివిధ రకాల పుష్పాలు, పత్రాలతో శ్రీదేవి భూదేవి సమేత శ్రీమలయప్ప స్వామివారికి పుష్పాలతో అర్చన చేస్తారు. కనుక దీనిని పుష్పార్చన అని అంటారు. ఈ వేడుక 30వ తేదీ గురువారం తిరుమల శ్రీవారి ఆలయంలో జరుగనుంది.

News October 30, 2025

మంచిర్యాల: బైక్ కొనివ్వలేదని యువకుడి సూసైడ్

image

బైక్ కొనివ్వలేదని యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన మంచిర్యాల జిల్లా దేవాపూర్‌లో జరిగింది. ASF జిల్లా సుద్దాపూర్‌ వాసి గంగుబాయి దేవాపూర్‌కు వలస వచ్చారు. ఆమె కొడుకు సాయి(20) మెకానిక్ షాపులో పనిచేస్తున్నాడు. బైక్ కోసం తల్లిని వేధించగా ఆమె డబ్బు లేదనడంతో మనస్తాపం చెంది బుధవారం ఉదయం ఇంట్లో ఉరేసుకున్నాడు. గతంలోనూ సాయి ఆత్మహత్యాయత్నం చేశాడు. SI గంగారాం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.