News March 31, 2025

రాజన్న సిరిసిల్ల: కొత్త సంవత్సరం.. స్థానిక సమరం!

image

స్థానిక సంస్థల ఎన్నికల ఆశావహులకు శ్రీ విశ్వావసు నామ సంవత్సరం రాజకీయ భవిష్యత్‌ను తేల్చనుంది. రాజన్న సిరిసిల్ల జిల్లాలో త్వరలో సర్పంచ్, వార్డ్ మెంబర్, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు ఈ నూతన సంవత్సరంలో జరగనున్నాయి. వీటితో పాటు ఈ ఏడాది సిరిసిల్ల, వేములవాడ మున్సిపాలిటీ ఎన్నికలు కూడా ఉన్నాయి. దీంతో ఈ ఎన్నికల్లో పోటీకి సిద్ధమైన రాజకీయ ఆశావహులకు ఈ ఏడాది ‘కీ రోల్’ కాబోతోంది.

Similar News

News April 4, 2025

వెబ్‌సైట్లో సీనియారిటీ ఉపాధ్యాయుల తుది జాబితా 

image

వెబ్‌సైట్లో ఉపాధ్యాయుల సీనియారిటీ తుది జాబితాను అందుబాటులో ఉంచినట్లు నెల్లూరు జిల్లా విద్యాశాఖ అధికారి డాక్టర్ ఆర్ బాలాజీ రావు తెలిపారు. ప్రధానంగా స్కూల్ అసిస్టెంట్, సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయులతో పాటు, ఎస్జీటీ నుంచి స్కూల్ అసిస్టెంట్ సబ్జెక్ట్ వారీగా పదోన్నతి జాబితాను కూడా అందుబాటులో ఉంచామన్నారు. జాబితాపై ఏమైనా అభ్యంతరాలు ఉంటే 11వ తేదీలోగా తెలపాలన్నారు.

News April 4, 2025

చిత్తూరు: 32 మంది కార్యదర్శులకు నోటీసులు

image

ఆస్తి పన్ను వసూళ్లలో పురోగతి చూపించని 32 మంది ఉద్యోగులకు చిత్తూరు మున్సిపల్ కమిషనర్ నరసింహ ప్రసాద్ గురువారం షోకాజు నోటీసులు జారీ చేశారు. ఆస్తి పన్ను వసూళ్లలో రాష్ట్రంలో మున్సిపల్ కార్పొరేషన్ 10వ స్థానంలో నిలిచింది. పన్ను వసూళ్లలో సచివాలయంలో పనిచేస్తున్న పలువురు కార్యదర్శులు 75 శాతాన్ని చేరుకోలేదంటూ రెవెన్యూ విభాగం అధికారులు కమిషనర్‌కు నివేదిక అందించారు. దీని ఆధారంగా ఆయన నోటీసులు జారీ చేశారు.

News April 4, 2025

మైదుకూరు : పైపులైన్ పనుల్లో బయటపడ్డ మృతదేహాలు

image

మైదుకూరు నుంచి కొప్పర్తి ఇండస్ట్రియల్ హబ్‌కు నీరు సరఫరా చేసే పైపులైన్ పనుల్లో కాజీపేట రావులపల్లె చెరువులో పాత మృతదేహాలు వెలికితీయడం కలకలం రేపింది. శ్మశానం లేక చెరువులో పూడ్చిన మృతదేహాలు బయటపడడంతో దుర్వాసన వ్యాపిస్తోందని స్థానికులు ఆరోపించారు. శ్మశానం నిర్మిస్తామని చెప్పిన ప్రభుత్వం ఇప్పటికీ చర్యలు తీసుకోకపోవడంతో.. విమర్శిస్తున్నారు. 

error: Content is protected !!