News March 31, 2025

పెద్దపల్లి: గ్రామాల్లో జోరుగా పైరవీలు..?

image

PDPL జిల్లావ్యాప్తంగా జరిగిన ప్రజాపాలనలో ప్రజలు ఇందిరమ్మ ఇండ్లకోసం దరఖాస్తు చేసుకున్నారు. కానీ, ప్రభుత్వం ఇప్పటివరకు లబ్ధిదారుల లిస్ట్‌ను ఫైనల్ చేయలేదు. జిల్లాకు 10,500 ఇళ్లు మంజూరైన విషయం తెలిసిందే. దీంతో జిల్లాలోని అధికారపార్టీకి చెందిన చోటామోటా నాయకులు ఇందిరమ్మ ఇండ్లు ఇప్పిస్తామని జోరుగా పైరవీలు సాగిస్తున్నట్లు సమాచారం. అసలైన అర్హులు తమకు ఇందిరమ్మ ఇల్లు వస్తుందో, రాదో అని ఆందోళన చెందుతున్నారు.

Similar News

News September 18, 2025

ఆహా! ఎంత అద్భుతమైన శ్లోకం (1/2)

image

‘తం భూసుతా ముక్తిముదార హాసం
వందే యతో భవ్యభవం దయాశ్రీ:
శ్రీ యాదవం భవ్య భతోయ దేవం
సంహారదా ముక్తి ముతా సుభూతం’
పండిత దైవజ్ఞ సూర్య సూరి రచించిన శ్రీ రామకృష్ణ విలోమ కావ్యంలోని శ్లోకమిది. ముందు నుంచి చదివినా, వెనుక నుంచి చదివినా ఈ శ్లోకం ఒకేలాగా(వికటకవి లాగ) ఉంటుంది. ఎడమవైపు నుంచి చదివితే శ్రీరాముణ్ని, కుడివైపు నుంచి చదివితే శ్రీకృష్ణుణ్ని స్తుతించేలా ఉన్న ఈ శ్లోకం అద్భుతం కదా!

News September 18, 2025

ఆహా! ఎంత అద్భుతమైన శ్లోకం (2/2)

image

ఈ శ్లోకాన్ని ఎడమ నుంచి చదివితే ‘ఎవరైతే సీతను కాపాడారో, ఎవరి చిరునవ్వు అందంగా ఉంటుందో, ఏ అవతారం విశేషమైనదో, ఎవరినుంచైతే దయ, అద్భుతమూ ప్రతిచోట వర్షిస్తుందో అట్టి రాముడికి నమస్కరిస్తున్నాను’ అని అర్థం వస్తుంది. కుడి వైపు నుంచి చదివితే ‘యాదవ కులంలో పుట్టిన, సూర్యచంద్రులకు ప్రాణాధారమైన, పూతనను సంహరించిన, సకల సృష్టికి ఆత్మయైన శ్రీకృష్ణుడికి నమస్కరిస్తున్నాను’ అనే అర్థం వస్తుంది. అద్భుతమైన శ్లోకం కదా!

News September 18, 2025

నెల్లూరు: రేషన్ బియ్యం అక్రమ రవాణా ఆగేదెప్పుడు?

image

నెల్లూరులో రేషన్ బియ్యం మాఫియా ఆగడం లేదు. ప్రభుత్వ హెచ్చరికలు, కేసులు ఉన్నా అక్రమార్కులు కోట్ల విలువైన బియ్యం నల్లబజారుకు మళ్లిస్తున్నారు. నెల్లూరు, ఆత్మకూరు ప్రాంతాలకు చెందిన వ్యాపారులు మిల్లుల్లోనే బియ్యం రీసైకిల్ చేసి సీఎంఆర్ కింద ప్రభుత్వానికే తిరిగి పంపుతున్నారు. జిల్లాలో నెలకు సరఫరా చేసే 11 వేల టన్నుల్లో సుమారు 8 వేల టన్నులు పక్కదారి పడుతున్నాయని సమాచారం.