News March 26, 2024

సీఏఏతో మోదీ సర్కార్ కుట్ర: కేరళ సీఎం

image

ముస్లింలను రెండో శ్రేణి పౌరులుగా మార్చాలని పౌరసత్వ సవరణ చట్టం(CAA) ద్వారా బీజేపీ కుట్ర పన్నుతోందని కేరళ CM పినరయి విజయన్ మండిపడ్డారు. ‘ముస్లిం పాలకులు, సాంస్కృతిక సారథులు ఎందరో దేశ చరిత్ర, స్వాతంత్ర్య పోరాటంలో పాలు పంచుకున్నారు. వాస్తవానికి భారత్ మాతాకీ జై, జైహింద్ అని నినదించింది ముస్లింలని సంఘ్ పరివార్‌కి తెలియదనుకుంటా. CAAకి వ్యతిరేకంగా పోరాడాలనే ఉద్దేశం కాంగ్రెస్‌కు లేదు’ అని ఫైర్ అయ్యారు.

Similar News

News January 21, 2026

రాజాసాబ్ ఫెయిల్యూర్‌కి అదే కారణం: తమ్మారెడ్డి

image

ప్రభాస్ ‘రాజాసాబ్’ను రూ.100 కోట్లతో రీజినల్ ఫిల్మ్‌గా తీసుంటే లాభాలు వచ్చేవని సీనియర్ డైరెక్టర్ తమ్మారెడ్డి భరద్వాజ్ అన్నారు. ‘ఈ మూవీని తొలుత తక్కువ బడ్జెట్‌లో తెలుగులో తీయాలనుకున్నారు. తర్వాత పాన్ ఇండియా ఆలోచనతో పదే పదే స్క్రిప్ట్ మార్చారు. దీంతో మొదట అసలు కథ తెరకెక్కలేదు. మేకర్స్‌కు పాన్ ఇండియా ఆలోచన వస్తే చేసే మార్పులు కొన్నిసార్లే సక్సెస్ ఇస్తాయి’ అని ఓ ఇంటర్వ్యూలో అభిప్రాయపడ్డారు.

News January 21, 2026

స్మార్ట్ ఫోన్ యూజర్లకు త్వరలో కొత్త ఫీచర్!

image

గూగుల్ ఫొటోస్ యాప్‌లో మీడియా ఫైల్స్ బ్యాకప్ చేసినప్పుడు ఫోన్ ఛార్జింగ్ ఎక్కువగా అయిపోతుంటుంది. బ్యాక్‌గ్రౌండ్‌లో జరిగే సింకింగ్, ఆపరేషన్సే దీనికి కారణం. ఈ సమస్యకు చెక్ పెట్టేందుకు ఈ యాప్‌లో త్వరలో ‘ఆప్టిమైజ్ బ్యాకప్ ఫర్ బ్యాటరీ లైఫ్’ అనే ఫీచర్ రానుంది. ఇది అనవసరమైన సింకింగ్‌ను తగ్గించి బ్యాటరీ లైఫ్‌ను పెంచుతుంది. యాప్ ఓపెన్ చేసినప్పుడు లేదా ఫోన్ వాడనప్పుడు మాత్రమే బ్యాకప్ జరుగుతుంది.

News January 21, 2026

ఇది డిఫరెంట్ ఎక్స్‌పీరియన్స్ అవుతుంది: రోహిత్

image

టీ20 WCని ఈసారి ఇంట్లో కూర్చొని చూడటం తనకు స్ట్రేంజ్ ఎక్స్‌పీరియన్స్ అవుతుందని రోహిత్ శర్మ అన్నారు. 2007 నుంచి 2024 వరకు అన్ని టీ20WCలలో తాను ఆడానని, ఈసారి స్టేడియంలో ఎక్కడో కూర్చొని లేదా ఇంటి నుంచి చూడటం డిఫరెంట్‌గా ఉంటుందన్నారు. గతంలో WCకి ముందు కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకున్నట్లు గుర్తుచేసుకున్నారు. స్క్వాడ్‌లో ఉన్న 15 మందిని ఎలా ఉపయోగించాలో తెలుసుకోవడం ముఖ్యమని పేర్కొన్నారు.