News March 31, 2025
నేడు YV సుబ్బారెడ్డి తల్లి పెద్దకర్మ.!

తన తల్లి పిచ్చమ్మకు సోమవారం పెద్దకర్మ నిర్వహిస్తున్నట్లు ఒంగోలు మాజీ ఎంపీ వై.వీ సుబ్బారెడ్డి తెలియజేశారు. భద్రతా కారణాల దృష్ట్యా స్వగ్రామం మేదరమెట్లలో కాకుండా.. ఒంగోలులోని కళ్యాణ మండపంలో కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. కాగా ఈ కార్యక్రమానికి పిచ్చమ్మ అల్లుడు.. మాజీ మంత్రి బాలినేని. శ్రీనివాసరెడ్డి హాజరవుతారా, లేదా అనేది తెలియాల్సి ఉంది.
Similar News
News January 18, 2026
25న తిరుమలలో రథసప్తమి

సూర్య జయంతి సందర్భంగా ఈ నెల 25న తిరుమలలో రథసప్తమి నిర్వహించనున్నట్లు TTD తెలిపింది. 7 వాహనాలపై స్వామివారు ఆలయ మాడ వీధుల్లో విహరించనున్నారని చెప్పింది. 5.30AM నుంచి 9PM వరకు వివిధ వాహనాల్లో భక్తులకు దర్శనమిస్తారని పేర్కొంది. పవిత్ర మాఘ మాసంలో శుక్ల పక్ష సప్తమి తిథిని రథసప్తమి/మాఘ సప్తమి అని పిలుస్తారు. ఈ రోజు సూర్యదేవుడు జన్మించాడని, ప్రపంచానికి జ్ఞానం ప్రసాదించాడని వేదాల ద్వారా తెలుస్తోంది.
News January 18, 2026
బోథ్‌లో బార్ హెడెడ్ గీస్ పక్షులు

బోథ్ మండలంలోని గొల్లాపూర్ చెరువులో సుమారు 300కి పైగా బార్-హెడెడ్ గీస్ (Bar-headed Geese) పక్షులను గుర్తించినట్లు ఎఫ్ఐఆర్ ప్రణయ్ తెలిపారు. ఈ పక్షుల గణనను అటవీ శాఖ, డబ్ల్యూడబ్ల్యూఎఫ్–ఇండియా సంయుక్తంగా నిర్వహించాయన్నారు. శీతాకాల వలస పక్షుల్లో ప్రసిద్ధి చెందిన ఈ గీస్‌లు ఏటా మధ్య ఆసియా, టిబెట్ ప్రాంతాల నుంచి వేల కిలోమీటర్లు ప్రయాణించి భారతదేశంలోని తడిచెరువులు, సరస్సులను ఆశ్రయిస్తాయన్నారు.
News January 18, 2026
KNR: మొదలైన సమ్మక్క సారలమ్మ ఎత్తు బంగారం

ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా సమ్మక్క – సారలమ్మ ఎత్తు బంగారం మొక్కులు ప్రారంభమయ్యాయి. తమ కోరికలు నెరవేరిన భక్తులు అమ్మవార్లకు ‘నిలువెత్తు బంగారం’ (బెల్లం) సమర్పించేందుకు సిద్ధమవుతున్నారు. దీంతో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పెద్ద పెద్ద కిరాణా షాపుల్లో ఎత్తు బంగారం కోసం భక్తులు బారులు తీరుతున్నారు. మీ ప్రాంతంలో నిలువెత్తు బంగారం ఇవ్వడం ప్రారంభమైందా..? కామెంట్ చేయండి.


